ఆ మెడిసిన్‌ ఒక్క డోస్‌ ధర రూ. 28కోట్లు..ప్రపంచంలోనే ఖరీదైన ఔషధం..

-

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. మంచి జీవనశైలి పాటించాలి.. అది తప్పితే.. రోగాలకు బానిస అవ్వాల్సిందే.. ఆ టైంలో..వచ్చిన జబ్బును బట్టి మందులు వేసుకోవాలి. కొన్ని మందులు కాస్ట్ తక్కువగానే ఉంటుంది.. కానీ కొన్ని మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి.. చిన్న బాటిలే 2వేలు ఉంటే..మనం వామ్మో అనుకుంటాం.. డబ్బంతా మందులకే పోతుంది అని ఎప్పుడూ ఆందోళన చెందుతాం..మరి అలాంటిది.. ఒక్క ఔషధం డోస్‌ ధర అక్షరాల రూ. 28కోట్లు ఉంటే.. అవును..ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధమట.. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) హెమ్‌జెనిక్స్ అనే ఔషధాన్ని ఆమోదించింది.
Hemgenics అనేది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం. దీని ధర ఒక్కో డోసుకు 3.5 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ రూపాయల ప్రకారం దీని ధర దాదాపు రూ.28 కోట్లు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించేందుకు ఈ విపరీతమైన ఔషధం వస్తుందని ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న కంపెనీ సీఎస్ఎల్ బెహ్రింగ్ అంటోంది.. గ్లోబల్ న్యూస్ నివేదిక ప్రకారం, దేశంలో హిమోఫిలియా బికి ఇది మొదటి జన్యు చికిత్స. ఈ ఔషధం రక్తం గడ్డకట్టడానికి ఒక సారి చికిత్స కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ అత్యంత ఖరీదైన ఔషధాన్ని ఏజెన్సీ వారు మార్కెట్‌లో విక్రయానికి ఉంచారు.
హిమోఫిలియా అనేది రక్తస్రావం రుగ్మత. ఇది జన్యుపరమైన వ్యాధి. చాలా తక్కువ మందిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ వ్యాధి కారణంగా శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రక్రియ మందగిస్తుంది. దీని కారణంగా శరీరం నుంచి ప్రవహించే రక్తం త్వరగా ఆగదు. అటువంటి పరిస్థితులలో వ్యక్తికి సకాలంలో చికిత్స చేయకపోతే అతడు చనిపోయే ప్రమాదం ఉంటుంది. దీని కోసం రోగి ఫ్యాక్టర్ IX యొక్క చాలా ఖరీదైన IV డ్రిప్‌లను తీసుకోవాలి. ఇది ప్రోటీన్. దీని ద్వారా రక్తం గడ్డకట్టడం స్తంభింపజేస్తుంది. ఈ వ్యాధి స్త్రీలలో కంటే పురుషులలోనే ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో జన్మించిన ప్రతి 5,000 మంది పురుషులలో ఒకరు హిమోఫిలియా బారిన పడుతున్నారు.
ఈ లెక్కన మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 1300 మంది పిల్లలు హిమోఫీలియాతో పుడుతున్నారు. హిమోఫిలియా బి ఈ రుగ్మత చాలా తీవ్రమైన వ్యాధి. ఇది దాదాపు 40,000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. హెమ్జెనిక్స్ కాలేయంలో గడ్డకట్టే ప్రోటీన్ కోసం ఒక జన్యువును అందించడం ద్వారా పనిచేస్తుంది. ఆ తర్వాత రోగి దానిని స్వయంగా ఉత్పత్తి చేయవచ్చు. మనిషి ప్రాణానికి మించిన ఖరీదు ఇంకేదీ ఉండదు.. ఆ ప్రాణం కాపాడేందుకు కోట్ల విలువైన ఔషధాలు తయారుచేస్తున్నారు.. పరిస్థితి చేయిదాటనంత వరకే మనం ఏమైనా చేయగలం..ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతిందో..డబ్బులు నీళ్లలా ఖర్చు అయిపోతాయి. కాబట్టి..వీలైనంత వరకూ మంచి జీవనశైలి పాటిస్తూ.. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం..!

Read more RELATED
Recommended to you

Latest news