పాస్‌పోర్ట్‌పై ఒకటే పేరు ఉంటే.. ఆ దేశానికి నో ఎంట్రీ..! UAE న్యూ రూల్స్‌..

-

దేశం దాటాలంటే.. పాస్‌పోర్ట్ కచ్చితంగా కావాలి. అయితే మీరు ఎక్కడి వెళ్లాలో ఆ దేశం అంగీకరించాలి.. ఆ దేశ ప్రభుత్వం ఒప్పుకుని వీసా ఇస్తేనే మీరు వెళ్లగలరు. పాస్ పోర్టుపై ఒక పదం పేరు ఉంటే మాత్రం తమ దేశంలోకి ఎంట్రీ ఉండదని.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ స్పష్టం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నిబంధనల్లో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఇటీవల కీలక మార్పులు చేసింది. యూఏఈ (UAE) అంతర్జాతీయ ప్రయాణికుల ప్రవేశ నియమాలను మార్చడంతో పాటు.. నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.
ఈ మార్పుల ప్రకారం.. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి భారతీయ విమానయాన సంస్థలు.. యూఏఈ తాజా మార్పుల గురించి ప్రయాణికులకు తెలియజేస్తూ ప్రకటనలను సైతం విడుదల చేశాయి. పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా కేవలం ఒక పదంతో.. మాత్రమే పేరు ఉండే వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అన్ని విమానయాన సంస్థలకు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త మార్గదర్శకాలు నవంబరు 21 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు సమాచారం ఇచ్చాయి.
యూఈఏ నిబంధనల ప్రకారం.. టూరిస్టు లేదా ఇతర రకాల వీసాదారులైనా పాస్‌పోర్టుపై పూర్తి పేరు లేకుండా ఒకే పదంతో పేరు ఉంటే వారిని యూఏఈలోకి అనుమతించరని భారత ఎయిర్‌లైన్లు వేర్వేర్లు ప్రకటనల్లో తెలిపాయి. పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉండే వారికి యూఏఈ వీసాలు జారీ చేయడం లేదని.. ఒకవేళ అలాంటి పాస్‌పోర్టుదారులకు ఇప్పటికే వీసా జారీ చేసినప్పటికీ.. అరబ్‌ దేశ ఇమ్మిగ్రేషన్‌ విభాగం అనుమతించట్లేదని విమానయాన సంస్థలు ప్రయాణికులకు స్పష్టం చేశాయి. అంటే పాస్‌పోర్ట్‌ మీద కచ్చితంగా పేరు, ఇంటిపేరు ఉండాల్సిందే..
ఈ కొత్త నిబంధన విజిట్‌ వీసా, వీసా ఆన్‌ అరైవల్‌, ఉపాధి లేదా తాత్కాలిక వీసాదారులకు వర్తిస్తుందని ఎయిర్ లైన్లు తెలిపాయి.. యూఏఈలో శాశ్వత లేదా నివాస హోదా ఉన్న వారికి ఈ నిబంధన వర్తించదని పేర్కొన్నాయి. శాశ్వత/నివాస హోదా ఉన్నవారికి పాస్‌పోర్టుపై ఒకే పదంతో పేరు ఉంటే.. అదే పేరును “first name” లేదా “surname’’ కాలమ్‌లో అప్‌డేట్‌ చేసుకోవాలని విమానయాన సంస్థలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news