పాదయాత్రతో జగన్‌కు చినబాబు సవాల్..వారే టార్గెట్..!

-

ఏపీలో పాదయాత్రల పర్వం మొదలు కానుంది. టీడీపీ యువ నేత లోకేష్ పాదయాత్ర చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పాదయాత్రపై చర్చలు జరిగాయి. ఇక చివరికి అన్నిరకాలుగా సెట్ చేసుకుని జనవరి 27 2023లో లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్ర డేట్ ఇచ్చేశారు..అలాగే పాదయాత్రకు సంబంధించి సన్నాహాలు కూడా చేస్తున్నారు.

ఇదే క్రమంలో తాజాగా లోకేష్..టీడీపీలోని యువ నేతలని ఒక టీంగా సెట్ చేసి..పాదయాత్ర నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, హరీష్ బాలయోగి, గ్రీష్మ, భూమా అఖిలప్రియ ఆదిరెడ్డి శ్రీనివాస్, అప్పలనాయుడు, సుధీర్ రెడ్డి, దేవినేని చందు..ఇంకా పలువురు యువ నేతలని పాదయాత్రలో భాగస్వామ్యులుగా చేశారు. ఇక పాదయాత్ర ఉండనున్న నేపథ్యంలో లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో వరుసగా పర్యటిస్తూ..అక్కడ తన బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ పాదయాత్రకు వెళితే..మంగళగిరిలో పర్యటించడానికి కుదరదు.

400 రోజుల పాటు..4 వేల కిలోమీటర్ల పాదయాత్ర జరగనుంది. ఇక మంగళగిరిలో నలుగురు రోజుల పాటు మాత్రమే యాత్ర ఉండనుంది. తాను మంగళగిరికి ఎక్కువ అందుబాటులో ఉండలేనని, కార్యకర్తలే అంతా చూసుకోవాలని, జనవరి 27 నుంచి పాదయాత్ర చేస్తున్నానని తాజాగా మంగళగిరి కార్యకర్తల సమావేశంలో చెప్పారు. అయితే లోకేష్ పాదయాత్ర ప్రధానంగా యువతనే టార్గెట్ చేసుకుని వెళ్లనున్నారు.

ఎందుకంటే యువత ఎక్కువగా వైసీపీ-జనసేన వైపు ఉన్నారు..అందుకే యువత ఓట్లు లక్ష్యంగా..కాలేజీలో విద్యార్ధులతో ఇంటరాక్ట్ అవ్వడం, నిరుద్యోగులని కలవడం ఇలాంటివి చేయనున్నారు. ఇక 175 స్థానాలు కవర్ అయ్యేలా పాదయాత్ర జరగనుంది. ఇదే క్రమంలో యువ నేతలకు 40 శాతం సీట్లు ఇస్తామని కూడా ప్రకటించారు. ఇక లోకేష్ పాదయాత్రకు గట్టిగానే కౌంటర్లు ఇవ్వడానికి వైసీపీ కూడా రెడీ అవుతుంది..ఆయన పాదయాత్రని అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేయొచ్చని తెలుస్తోంది. మరి చూడాలి లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీకి ఎంత ప్లస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news