ఉదయాన్నే మనం నిద్రలేస్తే మన పనులు కూడా త్వరగా పూర్తయిపోతాయి. రోజుని మనం త్వరగా మొదలు పెడతాము కాబట్టి పనులు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి. పైగా మనం అన్ని పనులు చేసుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది.
ఆలస్యంగా లేవడం వలన పనులు ఆలస్యం అవ్వడం మాత్రమే కాకుండా పనులు చేయాలనిపించకపోవడం యాక్టివ్ గా ఉండలేకపోవడం వంటి ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే త్వరగా లేవాలని మీరు ఎంతలా ప్రయత్నం చేసినా అవ్వడం లేదా..? అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. త్వరగా నిద్ర లేవాలనుకునే వాళ్ళు ఈ టిప్స్ ని పాటిస్తే కచ్చితంగా లేవడానికి అవుతుంది. ఇది మంచి అలవాటు కాబట్టి వీలైనంత వరకు అలవాటు చేసుకోండి.
రాత్రి త్వరగా నిద్రపోవడం:
రాత్రి త్వరగా నిద్రపోతే ఉదయం కూడా త్వరగా లేవడానికి అవుతుంది.
స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించొద్దు:
నిద్రపోవడానికి గంట ముందు స్మార్ట్ ఫోన్, లాప్టాప్ లని పక్కన పెట్టేయండి లేదంటే నిద్రలేమి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎక్కువ ఆహారం తీసుకోవడం:
రాత్రి లైట్ గా ఆహారం తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన త్వరగా నిద్రపోవడానికి అవ్వదు పైగా జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
అలారం:
చాలామంది వారి పక్కన అలారం పెట్టుకుంటారు దీని వలన అలరాన్ని ఆపేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు గదిలో ఒక మూలన పెడితే కచ్చితంగా లేస్తారు.
షెడ్యూల్ చేసుకోండి:
మీరు ఉదయం ఏ పనులు చేయాలనుకుంటున్నారో ఏ సమయానికి చేయాలనుకుంటున్నారో వాటిని మీరు ముందే షెడ్యూల్ చేసుకోండి అప్పుడు కచ్చితంగా మీ పనులు త్వరగా పూర్తవుతాయి. పైగా ఇన్ని పనుల్ని మీరు షెడ్యూల్ చేసుకున్నారు కాబట్టి పక్కా నిద్ర లేస్తారు.