శ్రియా శరన్.. ఒకప్పుడు టాలీవుడ్ లో తన జోరు సాగించిన హీరోయిన్. వెంకటేశ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్రహీరోలతో పాటు జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి యువ హీరోలతో కూడా కలిసి నటించింది.
ఇప్పుడు మాత్రం కాస్త గ్యాప్ వచ్చింది. ఇటీవలే గమనం, ఆర్ ఆర్ ఆర్ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం శ్రియ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
తన సినిమాలకు సంబంధించిన విషయాలే కాదు.. వ్యక్తిగత ముచ్చట్లను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది శ్రియ.
ఇక టైం దొరికితే చాలు తన భర్త ఆండ్రీ, కూతురు రాధతో కలిసి గడుపుతుంది. ముఖ్యంగా తన కూతురు రాధతో కలిసి శ్రియా కూడా చిన్నపిల్లలా ఆడుకుంటుంది. రాధకు సంబంధించిన ప్రతి విషయాన్ని శ్రియ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది.