అబ్బాయి కోసం చితక్కోట్టుకున్న అమ్మాయిలు..వీడియో వైరల్..

-

ఒకప్పుడు అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం మనం చూసే ఉంటాము..కానీ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు సిగ్గు ఎగ్గు లేకుండా బజారులో కొట్టుకోవడం ఈ మధ్య ఫ్యాషన్ అయి పోయింది.ఇలాంటి వీడియోలు ఎక్కడో చోట బయటకు వస్తూనే ఉన్నాయి.తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ వీడియో లో ఇద్దరు అమ్మాయిలుబాయ్ ఫ్రెండ్ విషయమై కొట్టుకున్నారు.

 

తన బాయ్ ఫ్రెండ్‌ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. అతనే తన జీవితం అనుకొని ఊహల ప్రపంచంలో తేలియాడింది.. ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకొని, ఏడు అడుగులు ఎప్పుడు వేయాలా? అంటూ ఊహల్లో తేలిపోతుంది.ఆమెను ఓ యువతి డిస్టర్బ్ చేసింది.తన ప్రియుడితో ఆమె చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విషయం ప్రియురాలి కంట పడింది. ఇంకేముంది నడి బజార్లో.. అందరి ముందు ఆ యువతి తాట తీసింది. నా బాయ్ ఫ్రెండే దొరికాడా అంటూ లాగి కొట్టింది. ఆమెకు తోడుగా మరో నలుగురు అమ్మాయిలు కలిసి ఆ యువతిపై భీకరంగా దాడి చేశారు.

చివరకు ఓ యువకుడు ఆమెను అమ్మాయిల దాడి నుంచి కాపాడాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అమ్మాయిల ఘర్షణకు సంబంధించిన షాకింగ్ ఘటన బీహార్‌లోని సరన్ జిల్లా పరిధిలోని సోనేపూర్ లో జరిగింది. సోనేపూర్‌ మేళా లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. యువకుడు వేరే అమ్మాయితో కలిసి జాతరకు వచ్చాడు.

ఈ సమయంలో వారిద్దరినీ చూసిన యువతి.. వారితో గొడవకు దిగింది. యువకుడితో నీకేం సంబంధం అంటూ ఆమెపై దాడి చేసింది. ఆమెకు మద్దతుగా మరో నలుగురు అమ్మాయిలు కూడా కొట్టారు.ఈ ఘర్షణతో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి..వామ్మో ఇలాంటి కొట్టుడు ఎప్పుడూ చూడలేదు అంటూ అక్కడ వున్న వాళ్ళు నోర్లు వెల్లబెట్టారు..మీరు చూడండి..

Read more RELATED
Recommended to you

Latest news