కవిత లోపల భయం ఉన్నా బయటకి అరెస్టు చేయండి అంటుంది – జగ్గారెడ్డి

-

టిఆర్ఎస్, బిజెపి రెండు పార్టీలు ఒకరికి ఒకరు దొంగలు అనుకుంటున్నారని.. గత కొద్ది రోజులుగా కవిత, బి ఎల్ సంతోష్ వార్తలే చూస్తున్నానని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ రెండు ప్రభుత్వాలు స్కాముల ప్రభుత్వాలేనని మండిపడ్డారు. కవిత, బిఎల్ సంతోష్ ఇద్దరూ నెరగాల్లేనని ఆరోపించారు. వీరిద్దరినీ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. బిజెపి మేము నీతిమంతులమని బిల్డప్ ఇస్తుందని.. మోడీ, అమిత్ షాలు వెనకాల ఉండి సంతోష్ ని ముందు పెట్టి ఎమ్మెల్యేలనుకుంటుందని ఆరోపించారు.

బిఎల్ సంతోష్ ని కాపాడడానికి బిజెపి ప్రయత్నం చేస్తుందని.. అతడిని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటకి వస్తాయన్నారు. కాంగ్రెస్ నేతలను కూడా ట్రాప్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బిఎల్ సంతోష్, కవితలను అరెస్టు చేయాలనేదే అజెండాగా తీసుకుంటామన్నారు జగ్గారెడ్డి. ఎమ్మెల్సీ కవిత తనని అరెస్టు చేసుకుంటే చేసుకోండని అన్నప్పటికీ ఆమె లోపల భయం దాగి ఉందన్నారు. బయటకి అలా అన్నప్పటికీ.. కవిత లోపల భయం దాగుందన్నారు. సిబిఐ ఎంక్వయిరీలో కవిత పేరు పెట్టింది కాబట్టి అరెస్టు చేయాలని అంటున్నాను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news