ఆమెలా కనిపించాలని రూ .97 కోట్లు ఖర్చుచేశాడు.. సీన్‌కట్‌ చేస్తే.. జనాలు చెప్పులు, చీపుర్లతో..

-

ఈ మధ్య అమ్మాయిలు అందంగా ఉంటే చాలు అనుకోవడం లేదు. అందరిలో స్పెషల్‌గా ఉండాలి అనుకుంటున్నారు. కొందరైతే.. తమకు ఇష్టమైన బొమ్మలా వాళ్లే మారిపోవాలి అనుకుంటున్నారు. మొన్నామధ్య..బార్బీగాల్‌గా కనిపించేందుకు ఓ అమ్మాయి ఏకంగా లక్షలు లక్షలు ఖర్చు చేసి సర్జరీల మీద సర్జరీలు చేయించుకుంది. తీరా రిజల్ట్ చూస్తే అందరి నోరెళ్లబెట్టేలా ఉంది. ఏదో అనుకుంటే ఇంకేందో అయింది. ఇంకో అమ్మాయి కూడా బ్రస్ట్ సైజ్‌ పెంచుకునేందుకు చాలా ఆపరేషన్స్‌ చేయించుకుంది. అప్పట్లే తనదే రికార్డు స్థాయిలో పెద్ద బ్రస్ట్‌ సైజ్‌ అని కూడా వార్తలు వినిపించాయి.. ఇప్పుడీ పిచ్చి అబ్బాయిలకు కూడా పాకినట్లుంది. మాజీ పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ లా కనిపించాలని ఆ అబ్బాయి అనుకున్నాడు. అందుకోసం రూ.97 కోట్లు ఖర్చు పెట్టాడు.
ప్రపంచంలోని చాలా మంది ప్లాస్టిక్ సర్జరీల మోజులో పడి.. అసలు తాము ఏం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు. ఈ సర్జరీల సంస్థలు కూడా.. అది బెటర్, ఈ ప్రొసీజర్ సూపర్ అంటూ.. వారిని ప్రేరేపిస్తున్నాయి. దాంతో.. భారీగా డబ్బు సమర్పించుకొని.. ఏదో అవ్వాలనుకొని.. ఇంకేదో అవుతున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథ.
అతని పేరు బ్రియాన్ రే. మాజీ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌లా కనిపించాలనేది తన కోరిక.. అందుకు రకాల సర్జరీలు చేయించుకున్నాడు. దాదాపు రూ.97 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు చేతిలో పెప్పర్ స్ప్రే, టాసెర్ గన్ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా జనం దాడి చేసి.. కొడుతున్నారట..
ఏం చేసుకోవాలో తెలియనంత డబ్బు ఉంటే.. ఇలా చేసుకుంటారా చెప్పండి.. దాన్ని ఏ పేదలకో, అనాథలకో ఇవ్వాలి గానీ.. ఇలా అడ్డమైన సర్జరీలు చేయించుకుంటావా.. అంటూ జనం అతనిపై ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఈమధ్య ఓ షాపింగ్ సెంటర్‌లో ఒక ఆవిడ.. పెట్రోల్ పోసి తగలబెడతానని వార్నింగ్ ఇచ్చిందట…
“నువ్వు అసలు మనిషివే కావు. మొత్తం ప్లాస్టిక్‌వి.. కావాలంటే నిన్ను అంటించి చూపిస్తాను. నీకే తెలుస్తుంది” ఆని ఆమె భగ్గుమంది. బ్రియాన్ ఈ మధ్య ఓ హోటల్‌కి వెళ్లాడు. అతన్ని చాలా సేపటి నుంచి ఫాలో అవుతూ వెళ్లిన ఓ గ్యాంగ్.. రాత్రి 3 గంటల సమయంలో హోటల్ గది తలుపు తట్టింది. లోపలున్న బ్రియాన్‌.. తలుపు తియ్యలేదు గానీ.. ఆ రాత్రి అతనికి కాళరాత్రిలా మారిందట.. నిద్రపోతే ఒట్టు.
బ్రియాన్.. సర్జరీల తర్వాత తొలిసారి 2017లో ఛానెల్ 4 అనే టీవీలో కనిపించాడు. బ్రిట్నీలా కనిపించేందుకు సర్జరీలు చేయించుకోవడం గర్వంగా ఉంది అన్నాడు. మరిన్ని చేయించుకుంటా అన్నాడు. ఆ తర్వాత.. అతను టీవీ స్టూడియోలో ఉండగానే ఓ మహిళ వచ్చి.. బ్రియాన్‌ని చితకబాదేందుకు యత్నించింది. ఓ రియాల్టీ టీవీ షోలో అతన్ని ఆమె చూసింది. అప్పటి నుంచే అతనిపై దాడి చెయ్యాలని ఆమె అనుకుంటోందట.
లాస్ ఏంజిల్స్‌కి చెందిన బ్రియాన్.. 17 ఏళ్ల వయసు నుంచి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ వచ్చాడు. రైనో ప్లాస్టీస్, చీక్ ఫేషియల్ ఇంప్లాంట్స్, సాఫ్ట్ టిష్యూ, లిప్ ఆగ్మెంటేషన్, ఐ లిడ్ లిఫ్ట్ వంటివి చేయించుకున్నాడు. ఈ సర్జరీల వల్ల.. బ్రియాన్.. అందరిలా సామాన్యంగా కనిపించట్లేదు. ఏదో తేడాగా ఉంటుంటే.. గ్రహాంతర వాసిని చూసినట్లు చూస్తున్నారు జనం.
2019లో రోడ్డుపై వెళ్తున్న బ్రియాన్‌‌ని ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. నువ్వు సర్జరీలు చేయించుకున్నావు కదూ. నాకు నీ గురించి తెలుసు అన్నాడు. దాంతో బ్రియాన్‌కి విషయం అర్థమైంది. తనను కొడతాడని గ్రహించి.. అక్కడి నుంచి పరుగు తీశాడట..
పాపం ఏదో అనుకున్న బ్రియాన్‌కు ఇంకేదో ఎదురైంది. దేవుడు ఇచ్చిన రూపాన్ని మనం కాపాడుకోవాలి. మీరు ఎంత స్పెషల్‌ కాకపోతే.. మీకు ఉన్న రూపం మరొకరికి దేవుడు పెట్టలేదు. అలాంటి మీకు మీరు నచ్చకుండా.. వేరే ఎవరిలానో కావాలనుకోవడం ఏంటి..? వాళ్లలా నువ్వు మారాలి అనుకున్నప్పుడే నీ ఆత్మను నువ్వు చంపేసిన వాడితో సమానం..!

Read more RELATED
Recommended to you

Latest news