ఫ్యాక్ట్ చెక్: లైఫ్ సర్టిఫికెట్ ని ఈ వెబ్ సైట్ ద్వారా పొందొచ్చా..?

-

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో ఒక వెబ్ సైట్  వైరల్ గా మారింది. ‘http://jeevanpraman.online’ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ ని పొందచ్చని.. లైఫ్ సర్టిఫికెట్ ని పొందేందుకు రూ.150 కడితే చాలని.. లైఫ్ సర్టిఫికెట్ ని పొందచ్చని అన్నారు. మరి ఇది నిజమేనా..?

రూ.150 కడితే లైఫ్ సర్టిఫికెట్ ని పొందొచ్చా..? దీనిలో నిజం ఎంత అనేది చూస్తే.. ‘http://jeevanpraman.online’ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ ని పొందచ్చనేది నకిలీదే. ఈ వెబ్ సైట్ కూడా నకిలీదే. దీనికి గవెర్నమెంట్ ఆఫ్ ఇండియా కి ఎలాంటి సంబంధం లేదు. ‘http://jeevanpraman.online వెబ్ సైట్ ప్రభుత్వానిది కాదు. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వెబ్ సైట్స్ ని నమ్మకండి. ఈ ఫేక్ వెబ్ సైట్స్ తో జాగ్రత్తగా వుండండి. డబ్బులు కూడా పోతాయి. అలానే ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ లో వచ్చే వాటికి దూరంగా వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news