నాని అసలైన హిట్ కష్టాలు తీరుతాయా..!!

-

నేచురల్ స్టార్ నాని  ప్రస్తుతం హిట్ 2 విజయం తో గాల్లో తేలుతున్నాడు. ఇప్పటికే  తాను నిర్మించిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటి పోయి సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది. చాలా రోజులు గా తాను నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో తో దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. ఇదే సమయంలో నిర్మాతా గా జోష్ లో ఉన్నాడు. కాని తాను నటించిన హిట్ కాలేదని భాద కూడా ఉంది. ప్రస్తుతం  తాను హీరోగా నటిస్తున్న దసరా అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి నెలలో రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమా తో కచ్చితంగా హిట్ కొట్టాలని చాలా కష్టపడుతున్నాడు. తాను ఆశించినట్లు ఈమూవీ బిజినెస్ నాని కెరియర్ లోనే అత్యధికంగా జరిగిందనే ప్రచారం వుంది.  మొదటి పాట ‘ధూమ్ ధామ్ దోస్తానా’  విడుదలైంది.  ఈ పాటకు రెస్పాన్స్ సూపర్ వస్తోంది దీనికి సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. అలాగే ఈ సినిమా లో నటిస్తున్న హీరోయిన్ కీర్తీ సురేష్ లుక్ కూడా రిలీజ్ చేశారు.ఇది కూడా ప్రేక్షకులను ఆకర్షించింది.

ఇక హిట్ కోసం మొత్తం మాస్ లాగా అయ్యాడు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో లాగా నాని గడ్డం తో చింపిరి జుట్టు పాత లుంగీ నలిగిన చొక్కాతోచాలా మాస్ గా  హడావుడి చేస్తున్నాడు. ఇక పోస్టర్ వెనకాల సిల్క్ స్మిత పోస్టర్ పెట్టుకొని మా సినిమాలో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని సింబాలిక్ గా చెబుతున్నాడు. ఇంత కష్ట పడుతున్న నాని కి హిట్ దక్కుతుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news