ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ముగిసింది. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షాలను కోరింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వ చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే మా ప్రధాన ఎజెండా అని తెలియజేశారు.
పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కోరాం అన్నారు భరత్. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం బీసీలకు అన్ని స్థాయిలో 50% పైగా పదవులు ఇచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రత్యేక చర్చలు చేపట్టాలని అన్నారు. బీసీ జనగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. విభజన హామీల పరిష్కారంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు భరత్.