రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతూ వెళ్తోంది. ఇప్పటికే ఐదు సార్లు రెపో రేటును కేంద్రం పెంచేసింది. అయితే మే నెల నుంచి డిసెంబర్ నెల వరకు కూడా రేపో రేటుని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.
ఇలా పెంచడం వలన రెపో రేటు 225 బేసిస్ పాయింట్ల పెరుగుదల తో 6.25 శాతానికి చేరింది. దీని మూలంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు, రుణ రేట్లు ని పెంచుతున్నాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… సేవింగ్స్ అకౌంట్స్ మీద కొన్ని బ్యాంక్స్ వడ్డీని పెంచాయి. అలానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచాయి. అయితే ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ ని సేవింగ్స్ అకౌంట్ మీద ఇస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. డీసీబీ బ్యాంక్, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఎక్కువ వడ్డీ ని ఇస్తున్నాయి. 7 శాతం వరకు వడ్డీని ఇస్తున్నారు. ఇక బంధన్ బ్యాంక్, సీఎస్బీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్స్ అయితే 6.5 శాతం వరకు వడ్డీ ని ఇస్తున్నారు. సౌత్ ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్స్ 6 శాతం ఇస్తున్నారు. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, కొత్త ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా సేవింగ్స్ అకౌంట్ మీద ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి.