ఎడిట్ నోట్: కవిత నో రెస్పాన్స్..!

-

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుమార్తె కవితని సీబీఐ అధికారులు విచారించడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో ఆమె పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్న వేళ..సీబీఐ అధికారులు ఆమెని విచారించడానికి నోటీసులు ఇవ్వడం..ఈ నెల 6వ తేదీన మొదట విచారణకు ఓకే చెప్పిన తర్వాత కొన్ని కార్యక్రమాల వల్ల అది 11వ తేదీకి వాయిదా పడింది. దీంతో తాజాగా సి‌బి‌ఐ అధికారులు కవితని విచారించారు. దాదాపు 6 గంటలపైనే ఆమె విచారించారు.

అయితే ఈ విచారణలో ఆమెని ఏ ప్రశ్నలు అడిగారు? కవిత ఏం చెప్పారు? సి‌బి‌ఐ అధికారులు లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై ఏం తేల్చారు? అనే అంశాలు పెద్దగా బయటకు రాలేదు. కానీ మీడియా సంస్థలు కొన్ని ఊహాగానాలని కథనాలుగా వేశాయి.  కవితకు సీఆర్పీసీ 160 కింద జారీ చేసిన నోటీసు మేరకు.. ఈ స్కామ్‌లో సాక్షిగానే ఆమెను విచారిస్తున్నట్లు తెలిపిన సి‌బి‌ఐ డీఐజీ.. తొలుత తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె న్యాయవాది సమక్షంలో ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే సి‌బి‌ఐ 40-50 ప్రశ్నలని అడిగినట్లు తెలిసింది. కానీ అందులో  కవిత నాలుగైదింటికే సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఎక్కువ శాతం ప్రశ్నలకు ‘తెలియదు’ అనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ స్కామ్‌కు సంబంధించి పలు ఆధారాలని, కవిత కాల్ డేటాని ముందు పెట్టుకునే సి‌బి‌ఐ విచారణ చేసినట్లు సమాచారం. అలాగే 10 ఫోన్లు వాడటం, వాటిని ధ్వంసం చేయడం.. అమిత్‌ అరోరా తెలుసా? దినేశ్‌ అరోరాతో మాట్లాడారా? శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎలా పరిచయం? అంటూ వరుస ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. ఇక ఎన్ని ప్రశ్నలు వేసిన రెస్పాన్స్ ఇవ్వకుండా తెలియదు అనే సమాధానం ఇస్తూ వచ్చారని తెలిసింది.

దీంతో చివరిగా సి‌బి‌ఐ..విచారణ పూర్తి అయ్యాక.. ఆమెకు మరోమారు నోటీసు అందజేశారు. సీఆర్పీసీలోని సెక్షన్‌ 91 ప్రకారం తమకు కావాల్సిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. అవసరమైతే మళ్ళీ విచారిస్తామని చెప్పుకొచ్చారు. విచారణ పూర్తి అవ్వగానే కవిత..మీడియాతో మాట్లాడకుండా డైరక్ట్ ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ కేసీఆర్‌ని కలిశారు. సి‌బి‌ఐ విచారణకు ముందు కూడా ఆమె పలుమార్లు కేసీఆర్‌ని కలిసిన విషయం తెలిసిందే. మొత్తానికి సి‌బి‌ఐ విచారణలో కవిత ఎక్కువగా తెలియదు అనే సమాధానం ఇస్తూ వెళ్లారని తెలిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news