రిటైర్ అయ్యాక ఆనందంగా ఉండాలంటే.. ఈ రెండు స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం మంచిది..!

-

ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతూ వుంటారు. నిజానికి స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తు లో సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి. చాలా మంది అందుకోసమే స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వుంటారు. భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే వృద్ధాప్యాన్నిసంతోషంగా గడపగలుగుతారు. ఈ రెండు పధకాలు కూడా అందుకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది ఈ పథకాలలో డబ్బులు పెడుతున్నారు. పైగా ఈ స్కీమ్స్ ని ప్రభుత్వమే తీసుకు వచ్చింది. మరిక ఆ స్కీమ్స్ కోసం చూసేద్దాం.

అటల్ పెన్షన్ యోజన స్కీమ్:

భవిష్యత్తు లో సమస్యలు ఏమి రాకుండా ఉండేందుకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. ఇందులో డబ్బులు పెడితే హాయిగా ఉండచ్చు. 18 ఏళ్ల 40 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరైనా సరే ఇందులో పెట్టుబడి పెట్టచ్చు. 60 సంవత్సరాలు నిండిన వారు ప్రతి నెలా 1000 నుండి 5000 రూపాయల వరకు పెన్షన్ పొందవచ్చు. ఈ స్కీమ్ లో 100% విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రభుత్వం చందాదారుల సహకారంలో 50 శాతం జమ చేస్తుంది లేదా ఏడాదికి రూ. 1000 జమ చేస్తుంది.

మంత్రి ప్రధాన వయ వందన యోజన:

ప్రధాన మంత్రి వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టడం వలన చక్కటి బెనిఫిట్ కలగనుంది. పదవీ విరమణ తర్వాత ఇంట్లో కూర్చొని పెన్షన్ ని పొందొచ్చు. ఈ స్కీమ్ లో మీరు 15 లక్షల రూపాయలు పెట్టుబడి ని పెట్టాల్సి వుంది. రిటైర్ అయ్యాక రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ వస్తుంది. ఇందులో మీరు రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తే… 8% చొప్పున వడ్డీ ని పొందొచ్చు. అంటే ఏడాదికి రూ. 1.20 లక్షలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news