రామ్ చరణ్ ధరించిన ఈ కాస్ట్యూమ్స్ ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

-

పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఈయన క్రేజ్ మరింత పెరిగిపోయింది.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రాంచరణ్ తదుపరి చిత్రాలను కూడా అదే రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోని శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు రాంచరణ్. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం విదేశాలను పర్యటిస్తూ షూటింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ తాజాగా ధరించిన కాస్ట్యూమ్స్ ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. ప్రస్తుతం ఆయన తన చేతికి ధరించిన రిచర్డ్ మిళ్లే వాచ్ ధర సుమారుగా రూ.3,03,38,852 అని తెలియడంతో అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. మరి ఈయన ధరించిన నైక్ షూస్ విలువ అక్షరాలా రూ.3,60,971.. అదేవిధంగా ఆయన ధరించిన గూచీ శాండిల్స్ విలువ రూ.53,300 అని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఏ సెలబ్రిటీలో అయినా సరే వారి సంపాదనకు అనుగుణంగా లగ్జరీ లైఫ్ ను గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ధరించే ప్రతి చిన్న వస్తువు కూడా బ్రాండెడ్ అయి ఉంటుంది.

అందుకే బ్రాండెడ్ వస్తువులను భారీ మొత్తంలో ఖరీదు చేసి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రాంచరణ్ ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు అని వార్త తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రామ్ చరణ్ ధరించిన ఈ వస్తువుల విలువ అన్ని కోట్లు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news