దీపిక ను పొగిడి వారికి కౌంటర్ వేసిన ప్రకాశ్ రాజ్.!

-

నటుడు ప్రకాష్ రాజ్  వివాదాలతో సహవాసం చేస్తూ ఉంటారు. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ ఆయన ఎంట్రీ ఇస్తారు. ఇక కేంద్ర ప్రభుత్వ విధానాల మీద, ఆ పార్టీ నాయకుల మీద ఆయన వంటి కాలి మీద లేస్తూ ఉంటారు.ప్రస్తుతం మరో సినిమా వివాదంలో కూడా వేలు పెట్టరుట్. ప్రస్తుతం షారుక్ ఖాన్ సినిమా పఠాన్ లో దీపిక పదుకొనె   సాంగ్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు చెలరేగి పోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఇదంతా చూస్తూ ఉన్న ప్రకాష్ రాజ్  గతంలో తన దైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు.ప్రకాష్ రాజ్  ట్విట్టర్ లో.. భేషరమ్ బిగోట్స్.. కాషాయం ధరించిన స్వామీజీలు మైనర్లని అత్యాచారం చేసినప్పుడు పట్టించుకోరు. అలాంటి స్వామీజీ లు, నాయకులు పబ్లిక్ గా తిరగొచ్చు.. అయినా ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ దీపికా పదుకొనె సినిమాలో కాస్ట్యూమ్ ధరించినప్పుడు మాత్రమే మీకు ఇబ్బందా ? అంటూ దీపికా కు సపోర్ట్ గా నిలిచారు.

ఇక ఆయన మళ్లీ మీడియా యొక్క రెండు నాలుకుల గురించి ఫైర్ అయ్యారు. కాగా నిన్న ఫిఫా కప్ ఫైనల్స్ కు హాజరయిన దీపిక వరల్డ్ కప్ ఆవిష్కరణ లో పాల్గొంది. కాని దీని గురించి ఏ మీడియా లో వార్తలు రాలేదు. ఇలాంటి కార్యక్రమం లో ఇండియన్ కి  చోటు దక్కడం విశేషమే.  అయినా ఎక్కడా వార్తలు రాలేదు ఇదిలా ఉంటే దీపికా కు సపోర్ట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది దీపికపదుకొనే. బేషరమ్ బిగోట్స్ ఇప్పుడు ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా బ్యాన్ చేస్తారా..? జెస్ట్ ఆస్కింగ్ అంటూ  తన దైన శైలిలో ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్.

 

Read more RELATED
Recommended to you

Latest news