తెలుగు బిగ్ బాస్ పై ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో కి వరుసగా నాలుగు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండవ సీజన్ కి న్యాచురల్ స్టార్ నాని.. ఆ తరువాత వరుసగా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు.
అయితే ఈ ఆదివారం తో ఆరవ సీజన్ ముగిసింది. వచ్చే ఏడాది సీజన్ 7 జరగబోతుంది. ఏడవ సీజన్ కి ఇంకో ఏడాది సమయం ఉండగానే కొత్త హోస్ట్ పై సంచలన నిర్ణయాలు లీక్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్.. సీజన్ కి మధ్య జనంలో ఆసక్తి తగ్గిపోతూ వస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఎవరికి పెద్దగా తెలియని కంటెంట్స్ నీ తీసుకోవడం వల్ల సీజన్ 6 ఆదరణ మరింత తగ్గడం నిర్వాహకులను ఆలోచనలో పడేసిందని టాక్.
అందువల్ల సీజన్ 7 కి హోస్ట్ గా బాలయ్యను తీసుకోవాలనే ఆలోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బాలయ్య అన్ స్టాపబుల్ షో ని నెంబర్ వన్ టాక్ షో గా నిలబెట్టారు. అందువల్ల 7 సీజన్ కి ఆయనను తీసుకోవాలని ఉద్దేశంతో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.