నయనతార ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పటి విజయ శాంతి లాగ ఆమె తెలుగు తమిళ భాషల్లో లేడీ సూపర్ స్టార్ గా స్టార్ డమ్ ని సొతం చేసుకుంది. మధ్యలో పిల్లల కోసం గ్యాప్ ఇచ్చిన నయన తార మళ్లీ వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక నయన తార లో ఒక లక్షణం గురించి చెప్పుకోవాలి.
తాను సినిమాలో నటించినా కూడా ఇతర హీరోయిన్స్ మాదిరిగా ప్రమోషన్స్ కు హాజరు కాదు. అలా అని ఒప్పుకుంటేే మాత్రమే ఆమె సినిమాలో నటిస్తుంది. ఇది ఎంత పెద్ద సంస్థ అయినా కూడా, ఎంత పెద్ద హీరో అయినా తగ్గదు. అయితే తాజాగా తాను నటించిన సినిమా కోసం అందరూ ఆశ్చర్య పోయేలా చేస్తూ ప్రమోషన్స్ కు హాజరు అయ్యింది. అయితే దీని వెనుక ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ ఉంది.
వివరాల్లోకి వెళితే.. నయనతార నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కనెక్ట్’. డిసెంబర్ 22న తమిళ తెలుగు భాషల్లో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా కోసం నయనతార తెలుగులోనూ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.తెలుగు ప్రమోషన్స్ కోసం యాంకర్ సుమతో కలిసి నయనతార ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొంది. నయన తార లో ఇంత మార్పు ఏమిటా అని ఆరా తీయగా ఈ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాత కావడం వల్లే సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన సినిమా కాబట్టి నయనతార తన రూల్ ని బ్రేక్ చేసి ప్రమోషన్స్ పాల్గొంది అని న్యూస్ బయటకి వచ్చింది.