ఆఫీస్‌లో మీరు చేసే ఈ తప్పులే కొంపముంచుతాయి..!!

-

కాలేజ్లో ఉన్నట్లు ఆఫీస్‌లో ఉండదు.. మనం కాలేజ్‌లో ఎలా ఉన్నా పెద్దగా ఏం కాదు.. కానీ ఆఫీస్‌లో మనం చిన్న ప్రవర్తనే పెద్ద రిజల్ట్‌కు దారితీస్తుంది. పైకి అందరూ నవ్వుతూ, నవ్విస్తూ కాలేజ్‌ దోస్తుగాళ్లలాగే ఉంటారు.. కానీ పైకి మాత్రమే అని మనం గమనించుకోవాలి.. తెలిసి తెలియక మీరు చేసే కొన్ని తప్పుల వల్ల మీ ప్రొఫిషనల్‌ కెరీర్‌ దెబ్బతింటుంది.. ముఖ్యంగా ఆఫీస్‌లో చేయకూడని తప్పులేంటో ఇప్పుడు చూద్దాం..!!
వ్యక్తిగత విషయాల గురించి ఫోన్‌లో మాట్లాడటం- ఆఫీసు అనేది కేవలం పని చేయడానికి ఒక స్థలం. మీ వ్యక్తిగత సమస్యల గురించి అందరూ వినడానికి లేదా స్నేహితులతో చాట్ చేయడానికి అక్కడికి వెళ్లి ఫోన్‌లో గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. ఇది మీ విలువను తగ్గిస్తుంది. ఇతరులకు ఆటంకం కలిగిస్తుంది. ఆఫీసులో ఎప్పుడూ వ్యక్తిగత సమస్యల గురించి డిస్కస్‌ చేయొద్దు..అలాగే అక్కడ ఫోన్లు చేసి చిరాకుపడటం చేయొద్దు.

వెన్నుపోటు

ఆఫీసులో వెన్నుపోటుపొడిచే వాళ్లు చాలానే మంది ఉంటారు..మీరు ఇప్పుడు వచ్చి మేనేజర్‌తో ప్రశంసలు పొందుతుంటే.. మీ సీనియర్స్‌కు మండొచ్చు.. ఎవరి బిహేవియర్‌ ఎలాంటిదో మీరు గమినించుకోవాలి.. అందరూ మనోల్లేగా అనే ధోరణిలో అస్సలు ఉండొద్దు.. ముఖ్యంగా ఆఫీసులో ఎవరైనా ఎవరి గురించి అయినా చెడుగా చెప్తే.. ఊ కొట్టి ఊరోకోవాలే కానీ.. మీరు వాళ్లతో పాటు ఏదో ఒకటి అన్నారో అంతే.. మీ ఉన్నతాధికారుల గురించి మాట్లాడకండి. ఇతరులు మాట్లాడుతున్నప్పటికీ, దూరంగా ఉండటం మంచిది.

సోషల్ నెట్‌వర్కింగ్

పని చేస్తున్నప్పుడు మీ మొబైల్ ఫోన్‌ని లేదా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను ఎక్కువసేపు బ్రౌజ్ చేయవద్దు. మీకు అందుబాటులో ఉన్న విరామ సమయంలో మినహా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు, మొబైల్ ఫోన్‌లలో సమయాన్ని గడపడటం అస్సలు మంచిది కాదు.

రొమాంటిక్ డ్రామాలు

ఆఫీసులో వాళ్లకు లైన్‌ వేయడం, ప్రేమించడం కూడా అంత మంచి పద్దతి కాదు.. ఇది ఇద్దరికి ఓకే అయితే పర్వాలేదు.. ఒకవేల ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని ఇష్టపడినా.. అది ప్రచారం చేసుకోకండి.. ఆఫీసులో ఉన్నంత వరకూ కొలీగ్స్ లానే ఉండాలి.. మీరు ఇద్దరు ఒకటే అనే భావన అందరిలో కలగనీయవద్దు..

ఇష్టం లేకుండా పనికి రావడం

కొన్ని కారణాల వల్ల మనకు ఆరోజు ఆఫీస్‌కు వెళ్లాలనిపించదు.. పని చేయలేక అలసిపోయినప్పుడు అదే క్రోధమైన ముఖంతో పనికి రావడం వీలైనంత వరకు మానుకోవాలి. బహుశా మీరు మంచి మానసిక స్థితిలో లేకపోవచ్చు లేదా ఆఫీసుకి రావాలని అనుకోకపోవచ్చు, ఆ రోజు సెలవు తీసుకుని, రిఫ్రెష్ చేసుకోండి.

అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆఫీస్‌కు రావడం

కొంతమంది హెల్త్ బాలేకున్నా… ఆఫీస్‌కు వస్తారో ఎందుకో తెలియదు.. అలాంటప్పుడు వీలైనంత వరకు పని చేయడం మానుకోవాలి. ఎందుకంటే మీకు సోకిన ఇన్ఫెక్షన్ ఇతరులకు వ్యాపించి అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ. అటువంటి పరిస్థితులలో, మీరు మీ పై అధికారి అనుమతితో సెలవు తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి పని చేయడానికి తగిన సౌకర్యాలను కోరవచ్చు. మీరు ఆఫీస్‌కు వచ్చి ఇబ్బంది పడటం అది చూసి ఎదుటి వాళ్లు డిస్టబ్‌ అవడం ఇదంతా పెద్ద సీన్‌ అవుతుంది.. అవసరమా..?

Read more RELATED
Recommended to you

Latest news