చంద్రబాబూ.. నీ బ్రతుకంతా ఇంతే! – అంబటి రాంబాబు

-

సత్తెనపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో ఆగస్టు 20వ తేదీన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారు. వారిలో వడ్డెర కులానికి చెందిన తురక అనిల్ కు ప్రభుత్వం నుంచి 5 లక్షల పరిహారం చెక్కు రూపంలో వచ్చింది. అయితే ఈ ఐదు లక్షలలో నుంచి రెండున్నర లక్షల రూపాయలు తమకు ఇవ్వాలని సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్ భర్త సాంబశివరావు డిమాండ్ చేసినట్లుగా బాధితులు చెప్పారు.

సాంబశివరావు పై ఫిర్యాదు చేయడానికి స్థానికంగా ఉన్నావో నేత సాయంతో మంత్రి అంబటి రాంబాబును కలిశామని బాధితులు చెప్పారు. అయితే మంత్రి కూడా తనకు రెండు లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని కరగకండిగా చెప్పారని బాధితులు ఆరోపించారు. ఆ డబ్బులు వస్తే తమ కూతురి పెళ్లి చేసుకుందామని ఆశలతో తాము ఉన్నామని.. మంత్రి పరిహారం డబ్బుల నుంచి కూడా లంచం అడిగారని బాధితులు వాపోయారు.

ఈ ఘటనపై టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “ఛీ.. మీరు పాలకులా ” అంటూ చంద్రబాబు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాక ఈ ఘటనపై పత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్ కి జత చేశారు చంద్రబాబు. చంద్రబాబు చేసిన ఈ ట్వీట్ కి స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. ” దున్నపోతు ఈనిందని ఈనాడు అంటే దూడను కట్టేయండి అని బాబు అంటున్నాడు నారా చంద్రబాబు.. నీ బ్రతుకంతా ఇంతే!” అని ట్వీట్ చేశారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Latest news