పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘సలార్’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కోల్ మైన్స్ నేపథ్యంలో కేజీఎఫ్ తరహా థీమ్ తో ఈ మూవీని ప్రశాంత్ నీల్ అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నాడు. ఇక కేజీఫ్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి సలార్ పై విపరీతంగా అంచనాలు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. సలార్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతుందని.. ఇంకా కాస్త షూటింగ్ మిగిలి ఉందన్నారు. వీఎఫ్ఎక్స్కు, పోస్ట్ ప్రొడక్షన్ కు కొంత సమయం కేటాయించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాను ఎలాగైనా సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు.
అంతే కాకుండా . ప్రభాస్, పృథ్విరాజ్ పోటీ పడి నటించారని పేర్కొన్నాడు. విజువల్స్ అదిరిపోయే లెవల్ లో ఉన్నాయని, సంక్రాంతికి మూవీ నుంచి అప్డేట్ కచ్చితంగా వస్తుంది అని తెలిపాడు. ఈ వార్త విన్న ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా పై మరింత అంచనాలు పెట్టుకుంటున్నారు.వాస్తవానికి ప్రభాస్ కు హిట్ కావాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ లాంటి హీరో దొరికితే, బాక్స్ బద్దలు అయ్యేలా చేయవచ్చు అని ఇన్నర్ ఫీలింగ్ తో బాహుబలి 2 టార్గెట్ ను కొట్టేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.