సీతక్కని ఓడించడం కోసం..కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కేసీఆర్ ట్రాప్..!

-

బీఆర్ఎస్ పార్టీలో నాయకులు ఫుల్ గా ఉన్నా సరే..ఇంకా కేసీఆర్..ఇతర పార్టీ నాయకులని లాగే ప్రయత్నాలు ఆపడం లేదు. అసలు 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలం లేదు..కానీ అధికారంలోకి వచ్చాక…టీడీపీ, కాంగ్రెస్ నేతలని లాక్కుని పూర్తిగా బలపడ్డారు. 2018 ఎన్నికల్లో మళ్ళీ గెలిచాక ఇంకా బలపడ్డారు. బలం ఎంతవరకు పెరిగిందంటే ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడేలా..అయినా సరే కేసీఆర్‌కు అది సరిపోవడం లేదు. ఇంకా కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజకవర్గాలని టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ లో ప్రస్తుతం మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే..అందులో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యని కేసీఆర్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. చాలారోజుల నుంచి ఆయన్ని బీఆర్ఎస్ లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు వీరయ్యని లాగితే…అటు భద్రాచలం..ఇటు ములుగులో కూడా బలపడవచ్చు అనేది కేసీఆర్ ప్లాన్. ములుగులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఉన్న విషయం తెలిసిందే.

 

అయితే గతంలో వీరయ్య ఇదే స్థానం నుంచి రెండుసార్లు గెలిచారు. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో సీతక్క టీడీపీ నుంచి పోటీ చేసి వీరయ్యని ఓడించారు. 2014లో ఇటు సీతక్క, అటు వీరయ్య సైతం బీఆర్ఎస్ పై ఓడిపోయారు. తర్వాత సీతక్క కాంగ్రెస్ లోకి వచ్చారు.

దీంతో సీతక్క ములుగులో, వీరయ్య భద్రాచలంలో పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు వీరయ్యని లాగితే అటు భద్రాచలం, ఇటు ములుగులో ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ములుగు బరిలో దింపి సీతక్కని ఓడించాలని చూస్తున్నారు. కానీ వీరయ్య ఎట్టి పరిస్తితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని అంటున్నారు. దీంతో కేసీఆర్ ప్లాన్ అనుకున్న విధంగా వర్కౌట్ అయ్యేలా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news