అవతార్ 2 సినిమా చూడాలని అనుకుంటున్న వారికి ఆఫర్.!

-

అవతార్ 2 సినిమా భారత్ లో ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నాలుగు వేలకు పైగా తెరలపై విడుదల అయ్యింది. ముందు విడుదల అయిన అవతార్ 1 చూసి ఎంతో మంది అవతార్ 2 కూడా సూపర్ గా ఉంటుందని చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇక మొదటి నుండి ఈ సినిమా త్రీడీ లో చూడాలని అప్పుడే మాత్రమే సినిమా అసలైన ఫీలింగ్ ఇస్తుందని చెప్పడంతో త్రీడీ థియేటర్స్ వీకెండ్ లో ఖాళీ ఉండటం లేదు.కాని నార్మల్ రోజుల్లో థియేటర్స్ ఖాళీ గా ఉంటున్నాయి.

మరోవైపు ఈ సినిమా టికెట్‌ రేట్స్‌ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్‌ మూవీ చూడాలి అనుకుంటున్న వారికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దీనితో కొంత మంది టిక్కెట్స్ రేట్స్ సినిమాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

వస్తున్న సమచారం ప్రకారం అవతార్‌-2 త్రీడీ వెర్షన్‌ టికెట్‌ ధరలు భారీగా  IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్‌ టికెట్‌ ధరను రూ.150కి తగ్గించారు. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడటానికి తాజాగా తీసుకున్న టికెట్‌ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news