మహిళలపై దాడులలో తెలంగాణది 4వ స్థానం !

-

మహిళలపై దాడులలో తెలంగాణది 4వ స్థానం అని విజయశాంతి ఫైర్ అయ్యారు.తెలంగాణ సర్కారు పనితీరుపై విపక్షాలు ఏవైనా విమర్శలు, ఆరోపణలు చేస్తే…. ఓర్వలేక అలా చేస్తున్నమని ఆడిపోసుకోవడం పాలకులకు, బీఆరెస్ నేతలకు మామూలైపోయిందని ఆగ్రహించారు.

 

తాజాగా విడుదలైన సోషల్ ప్రోగ్రెస్ ఇండెక్స్ బయటపెట్టిన వాస్తవాలను ఒక్కసారి గమనిస్తే నిజమేంటో తెలుస్తుంది. ఈ ఇండెక్స్ ప్రకారం… రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చేరువలోనే ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేశం మొత్తం మీద మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్)లో 2వ స్థానంలో ఉందన్నారు.

 

మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల్లో తెలంగాణది దేశంలో 4వ స్థానం. తెలంగాణలో జరుగుతున్న పెళ్లిళ్లలో నాలుగో వంతు అంటే, 23.5% బాల్య వివాహాలేనని, రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆ ఇండెక్స్ కచ్చితమైన సర్వే గణాంకాలను వెల్లడించింది. ఇలాంటి పరిస్థితులతో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో పురోగమిస్తుందో సీఎం కేసీఆర్ గారు ఒక శ్వేతపత్రం ద్వారా వివరిస్తే తెలుసుకోవాలని ఉందని తెలిపారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news