వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

-

ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ ని కేంద్రం 2016లో తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లకు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. గ్యాస్ సిలిండర్లపై కేంద్రప్రభుత్వం రాయితీని ఇస్తోంది. ఉజ్వల పథకం లబ్ధిదారులకు వంట గ్యాస్ సిలిండర్‌ పై ఏడాది లో 12 సిలిండర్‌లకు ఒక్కో దానికి రూ. 200 సబ్సిడీని ఏడాది పాటు ఎక్స్టెండ్ చేసే అవకాశం వుంది.

మార్చి 2023 తర్వాత కూడా గ్యాస్‌ సిలిండర్‌ పై రాయితీని ఎక్స్టెండ్ చేసేలా కనపడుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలోని మహిళలకు కేంద్రం కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం రూ.1,600ల ఆర్థిక సహాయం ని ఇస్తోంది. ఇదిలా ఉంటే రోజు రోజుకీ గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగిపోతున్నాయి. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పేద, మధ్య తరగతి వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500కే 12 సిలిండర్లను ఇస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.

అలానే గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వం ఈ సంవత్సరం అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు ప్రతి సంవత్సరం రెండు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లను ఇస్తామని చెప్పింది. అలానే కేంద్రప్రభుత్వం అందించే రాయితీని మరో ఏడాది ఎక్స్టెండ్ చేసేలా వున్నారు. ఈ సంవత్సరం నవంబర్ 1 నాటికి మేఘాలయలో 54.9శాతం మంది మాత్రమే వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు. త్రిపుర, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో చూస్తే.. 79.3శాతం, 80.2శాతం, 80.6శాతం మంది వంట గ్యాస్ సిలిండర్లను వాడుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news