ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్ ని రోజుకి ఒకటి తీసుకుంటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు. అయితే ఆపిల్ ముక్కలని కట్ చేసిన తర్వాత అవి నల్లగా అయిపోతాయి. దీనితో లంచ్ బాక్స్ లలో ప్యాక్ చేసుకుని తీసుకు వెళ్ళడానికి కూడా అవ్వదు. అయితే ఆపిల్ ముక్కలు నల్లగా అయిపోకుండా తాజాగా ఉండాలంటే ఈ ఇంటి చిట్కాలని పాటించండి దాంతో యాపిల్ ముక్కలు ఫ్రెష్ గా ఉంటాయి నల్లగా అయిపోవు.
జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టండి:
ఆపిల్ ముక్కలను జిప్ లాక్ బ్యాగ్ లో ఉంచడం వలన మొక్కలు నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఆపిల్ ముక్కాలా లో ఉంటే పాలీ ఫినోల్ ఆక్సిడెంట్స్ గాలి లోని ఆక్సిజన్‌తో రియాక్ట్ అవడానికి అవదు. కనుక మీరు జిప్ లాక్ బ్యాగ్ లో స్టోర్ చేయడం మంచిది.
తేనే:
ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి కలపండి. తర్వాత ఆపిల్ ముక్కల్ని అందులో వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచి తర్వాత తీసేస్తే ఫ్రెష్ గా ఉంటాయి.
ఉప్పులో వేయండి:
కొంచెం ఉప్పు తీసుకుని ఆపిల్ ముక్కల్ని అందులో ఉంచి తీసేయండి దీని వలన కూడా ఫ్రెష్ గా ఆపిల్ ముక్కలు ఉంటాయి.
దాల్చిన చెక్క:
దాల్చిన చెక్క పొడిని మీరు ఆపిల్ ముక్కల మీద జల్లితే కూడా ఆపిల్ బ్రౌన్ కలర్ లోకి మారిపోదు. ఫ్రెష్ గా ఉంటుంది. చూశారు కదా ఆపిల్ ముక్కలు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలి అని… మరి ఈ టిప్స్ ని యాపిల్ ముక్కలని కట్ చేసినప్పుడు అనుసరిస్తే సరి.