బెడ్‌పై నిద్రపోయే జాబ్‌.. జీతం లక్షల్లో..! రెండు నెలలు చేస్తే చాలట..!!

-

వర్క్‌ ఫ్రమ్‌ వల్ల మనం చాలాసార్లు బెడ్‌పై పడుకోని ఉద్యోగం చేస్తుంటా..ఇక తిన్న తర్వాత ఇలా చేస్తే పని చేస్తూ చేస్తూనే నిద్రలోకి జారుకుంటాం.. అసలు నిద్రపోవడమే ఒక జాబ్‌లా ఉంటే బాగుండి.. అప్పుడు ఆఫీస్‌లో బాస్‌ అంటాడుగా..నీకు నీద్రపోవడానికి కాదు శాలరీ ఇచ్చేది అని.. అవును..నిద్రపోవడానికే ఉద్యోగం ఇచ్చే కంపెనీలు ఉంటాయా..? ఉంటాయి.. కేవలం మంచంపై పడుకున్నందుకు లక్షల రూపాయలు జీతం తీసుకుంటే..? అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కేవలం రెండు నెలల పాటు నిద్రపోయే వారి కోసం వెతుకుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అలాంటి 24 మందికి NASA 15 లక్షల రూపాయలకు పైగా చెల్లించబోతోంది.

ఎంపికైన వారు రెండు నెలల పాటు కృత్రిమ గ్రావిటీలో జీవించాల్సి ఉంటుంది. అలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం జీవించిన తర్వాత శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలని నాసా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) NASA యొక్క జర్మన్ ఏరోస్పేస్ సెంటర్ రెండూ సంయుక్తంగా కృత్రిమ గురుత్వాకర్షణ ఆధారంగా విశ్రాంతి అధ్యయనాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ అధ్యయనంలో పాల్గొనే వాలంటీర్లు రెండు నెలల బెడ్ రెస్ట్ కోసం మాత్రమే దాదాపు రూ.15 లక్షలు తీసుకుంటారు… వ్యోమగాములు, శాస్త్రవేత్తలు జీరో గురుత్వాకర్షణలో పని చేస్తారు.

ఇది శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నాసా తొలిసారిగా కృత్రిమ గురుత్వాకర్షణ ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనంలో 24 నుంచి 55 సంవత్సరాల వయస్సు గల 12 మంది పురుషులు మరియు 12 మంది మహిళలు పాల్గొంటారు. దీనికి ఒక షరతు కూడా ఉంది. అలాంటి వాలంటీర్లు జర్మన్ భాష తెలుసుకోవాలి. జర్మన్ ఏరోస్పేస్ సెంటర్‌లోని ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్‌స్టిట్యూట్‌లో వాలంటీర్ల కోసం ఈ ప్రత్యేక బెడ్‌ను అభివృద్ధి చేశారు.

వాలంటీర్లు మొత్తం 89 రోజుల పాటు ఇక్కడే ఉండాల్సి ఉంటుంది. 60 రోజులు మంచం మీద విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో ఆహారం, ఇతర కార్యకలాపాలు మంచం మీద చేయవలసి ఉంటుంది. ఈ జాబ్‌ గురించి పైన విన్నప్పుడు బానే ఉంది అనుకోని ఉంటారు.. ఆర్టికల్‌ మొత్తం చదివాక ఏం అనిపిస్తుంది..!!

Read more RELATED
Recommended to you

Latest news