జోసెఫ్ గోబెల్స్ కొత్త అవతారం అమిత్ షా : కుమారస్వామి

-

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల మధ్య విమర్శల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోసెఫ్ గోబెల్స్ యొక్క కొత్త రూపం అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నరు అని విమర్శించారు కుమారస్వామి. గత ఎనిమిదేళ్ల పాలనలో మన దేశాన్ని విధ్వంస మార్గంలోకి తీసుకెళ్లారని అన్నారు కుమారస్వామి. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా వరుస ట్వీట్లు చేశారు. షాను గోబెల్స్‌తో పోల్చారు. జోసెఫ్ గోబెల్స్ కొత్త అవతారం అమిత్ షా అంటూ అభివర్ణించారు కుమారస్వామి. షాను రాజకీయ ఊసరవెల్లి అని, బీజేపీ ఓ కపట పార్టీ అంటూ ధ్వజమెత్తారు కుమారస్వామి. వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేయాలని… జేడీఎస్ పార్టీ కన్నడిగులకు ఏటీఎంగా మారుతుందని కుమారస్వామి చెప్పారు. తాము పేదలు, కూలీలు, రైతుల ఏటీఎంగా మారుతామని అన్నారు.

ఏటీఎం అంటే ఎనీటైమ్ హ్యుమానిటీ అని చెప్పారు మాజీముఖ్యమంత్రి కుమారస్వామి . వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు ఓటు వేయాలని… జేడీఎస్ పార్టీ కన్నడిగులకు ఏటీఎంగా మారుతుందని కుమారస్వామి చెప్పారు. తాము పేదలు, కూలీలు, రైతుల ఏటీఎంగా మారుతామని అన్నారు. ఏటీఎం అంటే ఎనీటైమ్ హ్యుమానిటీ అని చెప్పారు. మరోవైపు దీనికి స్పందించిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య జేడీఎస్ సంక్షోభ పార్టీగా మారిందని… వచ్చే ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగవుతుందని అయన అన్నారు .

 

 

Read more RELATED
Recommended to you

Latest news