యువతిని ఢీకొట్టి 12 కి.మీ ఈడ్చుకెళ్లిన కారు..వీడియో వైరల్

-

నూతన సంవత్సరం రోజున ఢిల్లీలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. సుల్తాన్‌ పురిలో ద్వి చక్ర వాహనంపై వెళుతున్న యువతిని ఢీకొట్టిన కారు ఆమెను 12 కిలో మీటర్లు ఈడ్చుకెల్లింది. యూటర్న్‌ లు కూడా కొట్టింది. ఈ సంఘటనలో ఆ యువతి శరీరం ఛిద్రమైపోయింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని నిందితులను అరెస్ట్‌ చేశారు. అనంతరం, ఆ యువతి మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక కేసులో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. మద్యం తాగి కారు నడిపారా, లేక కావాలనే ఆ యువతికి యాక్సిడెంట్‌ చేశారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news