అతడి కోసం ఎన్టీఆర్ నే వదులుకున్న సీత..!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయనతో సినిమా చేయాలి అంటే కేవలం సౌత్ హీరోయిన్ లే కాదు నార్త్ హీరోయిన్లు కూడా పోటీ పడుతూ ఉంటారు. అలాంటిది ఎన్టీఆర్ తో అవకాశం వస్తే అతడి కోసం ఎన్టీఆర్ ని వదులుకుంది. సీతారామం హీరోయిన్ సీత అలియాస్ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం ఈమె ఎన్టీఆర్ 30వ సినిమాలో అవకాశం వస్తే కాదనుకొని నాని 30వ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు.. ఇప్పుడు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ 30వ సినిమాలో మృణాల్ ఠాగూర్ ని తీసుకోవాలని కొరటాల శివ ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలోనే ఆమెకు నాని ఆఫర్ కూడా వచ్చిందట.

ఎన్టీఆర్ సినిమాలో పాత్ర కంటే నాని సినిమాలో పాత్ర వెయిట్ ఎక్కువగా ఉందని అనిపించడంతో మృణాల్ స్టార్ హీరో సినిమా అయినా సరే తారక్ సినిమాకు నో చెప్పిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను భారీగానే పారితోషకం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమె ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలను డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన రెండవ సినిమాకి ఈ రేంజ్ లో పారిపోషకం అంటే నిజంగా గ్రేట్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఒక సౌత్ లోనే కాదు వివిధ భాష ఇండస్ట్రీలలో కూడా ఈమెకు మంచి ఇమేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నాని కోసం ఎన్టీఆర్ ను వదులుకొందని తెలిసి ఎన్టీఆర్ అభిమానులు కాస్త ఫీలవుతున్నారనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news