మాజీ ఎంపీ పొంగులేటికి సర్కార్ ఝలక్

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేసీఆర్ సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయన భద్రత కోసం కేటాయించిన 3+3 భద్రతను 2+2కు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. భద్రతతో పాటు పొంగులేటికి కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని తొలగించింది. ఖమ్మంలోని పొంగులేటి నివాసం వద్ద భద్రత విధులు నిర్వహించే నలుగురు సిబ్బందిని తొలగించింది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయానికి ఖమ్మం ఏఆర్ పోలీసు అధికారులు సమాచారం చేరవేశారు. కుదించిన భద్రత ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం కేటాయించిన సెక్యూరిటీలో ఎవరిని ఉంచాలో తెలపాలని ఏఆర్ పోలీసులు కోరినట్లు తెలిసింది.

అధికార పార్టీ నాయకుడికి ఒక్కసారిగా భద్రత కుదిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే దీనికి కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2019లో అనూహ్యంగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ అధినాయకత్వంతో దూరం పెరుగుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news