తెలుగు రాష్ట్రాలలో బిగ్ బాస్ షో అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఇప్పటికే విజయవంతంగా ఐదువారాలు పూర్తి చేసుకున్న షో ఇప్పుడే అసలు పోటీతో వీక్షకులకు మజా ఇస్తోంది. ఐదు వారాలకు గాను ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు షో విజయవంతంగా ఆరవ వారంలోకి ప్రవేశించింది.
ఐదు వారాలకు గాను వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ అయిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రితో పాటు అషురెడ్డి, రోహిణి, జాఫర్, హేమ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు షోలో మొత్తం 11 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. మళ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఇది పక్కన పెడితే వచ్చే వారం ఎవరు ? ఎలిమినేట్ అవుతారు ? అన్నది ఆసక్తిగా మారింది.
ఈ వారం ఎలిమినేషన్లో హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ మొత్తం ఆరుగురు సభ్యులు నామినేట్ కావడం జరిగింది. దీనితో ఈ వారం నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా మారింది. వీరిలో వరుణ్‌ను కెప్టెన్ హోదాలో జ్యోతి నేరుగా నామినేట్ చేసింది. ఈ ఆరుగురి విషయానికి వస్తే చాలా తక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో రాహుల్ – పునర్నవి – మహేష్ విట్టాలకే ఎలిమినేషన్ ప్రమాదం పొంచివుందన్న చర్చలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి.
హీరో గ్లామర్ ఉన్న వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఇక రవికృష్ణకు బయట ఫ్యాన్స్ బాగా ఎక్కువవుతున్నారు. రవి కూడా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే వితక షేరుపై కొద్ది రోజులుగా కేవలం భర్త వరుణ్‌కే ప్రయార్టీ ఇస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వారం కెప్టెన్ శివ జ్యోతి వితిక షేరును నామినేట్ చేసివుంటే ఆమె ఈవారం ఎలిమినేట్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉండేవంటున్నారు.
రాహుల్, వితికకు ఈక్వల్‌గా 4 గు ఓట్లు రావడంతో జ్యోతి రాహుల్‌ను ఎలిమినేట్ చేసి వితకను సేవ్ చేయడంతో వితిక సులువుగా ఎస్కేప్ అయినట్లయ్యింది. ఇక రాహుల్, పునర్నవి, మహేష్ విట్టాలలో ఎవరు సేఫ్ అవుతారో ? ఎవరు ? ఎలిమినేట్ అవుతారో ? చూడాలి.