మంట పుట్టించే వ్యాఖ్యలు చేసి, కవర్ చేస్తున్న రష్మిక..!!

-

గతంలో కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే.. ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడుస్తోంది. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి పొగరుగా సమధానం ఇచ్చింది అని ఆమెను బ్యాన్ చేయాల్సిందిగా గోల గోల చేసిన సంగతి తెలిసిందే.

ఆ వివాదాన్ని మరచిపొక ముందే ఇక మళ్లీ అలాంటి మరో సారి వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం ఆమె తాజగా  రొమాంటిక్ సాంగ్స్ అనగానే బాలీవుడ్ గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి నేను బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ వింటూ పెరిగాను. సౌత్ చిత్రాల్లో ఈ తరహా రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. అక్కడంతా మాస్ మసాలా ఐటెం సాంగ్స్ మాత్రమే ఉంటాయి అంటూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనితో సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ అందరూ డొమ్మెత్తి పోశారు.

ఇక తాజాగా రష్మిక వీటిపై వివరణ ఇస్తూ ప్రతి ఒక్కరికీ ఒక్కో టేస్ట్ ఉంటుంది. అందరూ  మనల్ని ఇష్టపడతారని మేము ఆశించలేము. ఇక్కడ చాలా ద్వేషం ఉంటుంది.. ప్రేమ కూడా ఉంటుంది. నేను పబ్లిక్ సెలబ్రెటీని. ప్రజలతో మాట్లాడుతున్నాం.. వారితో ఉంటున్నాం. కొన్ని సార్లు వారంత మనల్ని ఇష్టపడకపోవచ్చు. నేను మాట్లాడే విధానం. నా యాటిట్యూడ్  కొంతమందికి నచ్చకపోవచ్చు.  అలాగే నేను ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చకపోవచ్చు. అందరకీ నచ్చక పోవచ్చు, కాని నన్ను మెచ్చే వారు కూడా ఉంటారు అంటూ కామెంట్స్ చేసింది రష్మిక .

 

Read more RELATED
Recommended to you

Latest news