గోపీచంద్ ప్రాణాలకు అడ్డుగా నిలిచిన బాలయ్య.. ఏమైందంటే…?

-

తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి ప్రభాస్, గోపీచంద్ ఇద్దరూ కూడా గెస్ట్ గా పాల్గొన్న విషయం తెలిసిందే. మొదటి ఎపిసోడ్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన ఆహా ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ లో భాగంగా గోపీచంద్ ను హైలెట్ చేస్తూ మరొక ఎపిసోడ్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే బాలయ్య బాబు.. గోపీచంద్.. ప్రభాస్ తో కలిసి మరింత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. గోపీచంద్ మరో లీక్ పై కన్ను కొట్టి మరీ క్లారిటీ ఇచ్చారు.. అంతేకాదు ఈ ఎపిసోడ్ ద్వారా గోపీచంద్.. ప్రభాస్ కి సంబంధించిన ఒక మేటర్ ను లీక్ చేశారు.

మొదట షోలోకి గోపీచంద్ రాగానే రామ్ చరణ్ లీక్ చేసిన విషయం గురించి బాలయ్య సరదాగా చెప్పుకొచ్చారు. ప్రభాస్ గురించి నువ్వే నిజాలు చెప్పాలి అని బాలయ్య నవ్వుతూ అడిగాడు… అంతేకాకుండా రామ్ చరణ్ ఒక చిన్న హింట్ ఇచ్చాడు అని.. ఎవరో రాణి అంట అంటూ ఒక సస్పెన్స్ క్రియేట్ చేశాడు అని, బాలయ్య బాబు గోపీచంద్ తో చెప్పాడు. గోపీచంద్ కూడా అవును.. రాణి గురించే కదా అంటూ ప్రభాస్ కి మరింత కోపం వచ్చేలా చేశారు. ప్రభాస్ కొంత నవ్వుతూనే మరొకవైపు ఆగ్రహంతో గోపీచంద్.. చెబితే పూర్తిగా చెప్పు.. సగం సగం చెప్పకు.. అంటూ మరోక కౌంటర్ ఇచ్చాడు. గోపీచంద్ అయితే వచ్చే యేడాది అయిపోతుంది అని.. మరో విధంగా మాట్లాడడంతో ఏమైపోతుంది అంటూ బాలయ్య అడిగాడు. ఆ తర్వాత ప్రభాస్ మరో అడుగు ముందుకేసి గోపీచంద్ ను కొట్టడానికి రెడీ అయ్యాడు.

ప్రభాస్ ఆ విధంగా చేయడంతో నందమూరి బాలయ్య గోపిచంద్ కు అడ్డుగా నిలబడి.. నువ్వు అతన్ని ఎందుకు బెదిరిస్తున్నావు.. అతన్ని నిజం చెప్పమని అంటూ బాలయ్య బాబు కూడా ప్రభాస్ తో చెప్పాడు. గోపీచంద్ ముందు ఉన్న బాలయ్య.. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేస్తాను అని.. నువ్వు చెప్పేదేదో చెప్పు అని సపోర్ట్ చేశారు.. మరొకసారి గోపీచంద్ కూడా అదే మాట అనడంతో ప్రభాస్ కొంత నవ్వు నవ్వుతూ నువ్వు నా పరువు తీయకు రా అని సరదాగా మాట్లాడాడు. ఆ తర్వాత ముగ్గురి మధ్య ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news