యువత మాటలు వినడానికి ఎదురుచూస్తున్నానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో ను విడుదల చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించబోయే యువశక్తి కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆ రోజున యువత మాటలను వినడానికి ఎదురుచూస్తున్నట్లు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ట్వీ ట్ చేశారు. తమ సమస్యలు తీర్చాలంటూ విద్యార్థులు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇవ్వాలని నిరుద్యోగులు చేసిన ఆందోళనలు వారిపై పోలీసుల దాడులతో కూడిన వీడియోలు పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్.
Looking forward to hear the ‘Voice of Youth’ on Jan 12 th in Ranasthalam. pic.twitter.com/OFIc8uD0Fd
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2023