ఒక ఫ్యాన్ బాయ్ మెగాస్టార్ తో సినిమా చేయడం నమ్మలేని నిజం..!!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  విడుదల కు సిద్ధంగా ఉంది ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు..సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.

ఈ రోజున జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను  విశాఖ పట్టణంలో ఆర్ కే బీచ్ లో  పోలీసులు పర్మిషన్ ఇవ్వక కాన్సిల్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ కు మార్చారు. జనాలు పోటేత్తే అవకాశం ఉందని అందుకే బీచ్ లో కంట్రోల్ చేయలేమని పెద్ద గ్రౌండ్ కు మార్చారట. ఇక శనివారం విడుదల అయిన ట్రైలర్ కు అధ్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. గంటల్లోనే  మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లైక్లు వస్తున్నాయి.

ఇక డైరెక్టర్ బాబీ మాట్లడుతూ వాస్తవానికి సినీ పరిశ్రమ లో నేను చిన్న స్తాయిలో వచ్చాను.చిరంజీవికి ఒక ఫ్యాన్ బాయ్ గా 2003 నా జర్నీ మొదలైయింది. ఇక అంచె లంచలు గా ఎదుగుతూ ఒక డైరెక్టర్ గా అయ్యాను. ఎప్పటినుండో చిరంజీవి గారి సినిమాలో చేయాలని ఆశ ఉండేది. ఇప్పుడు 2023లో మెగాస్టార్ చిరంజీవి గారిని డైరెక్ట్ చేసిన సినిమా విడుదవుతోంది. నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇది అని చెప్పుకొచ్చారు బాబీ.

 

Read more RELATED
Recommended to you

Latest news