పవన్-లోకేష్ సేమ్ కాన్సెప్ట్..జగన్‌కు చెక్?

-

నేటి రాజకీయాల్లో గెలుపుకు కొన్ని వ్యూహాలు ఉంటాయి..వాటిని పక్కాగా అమలు చేస్తే గెలుపు అందుకోవడం పెద్ద కష్టం కాదు. అయితే ప్రస్తుతం గెలుపు వ్యూహాల్లో ప్రధానమైనది..యువత ఓటర్లని ఆకట్టుకోవడం. వారిని ఆకట్టుకుంటే గెలుపు దగ్గరకొచ్చినట్లే. ఎందుకంటే రాజకీయాల్లో యువత ఓట్లు చాలా కీలకం. ఎప్పటికప్పుడు యువత ఓట్లు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి వారిని ఆకట్టుకోవడం అనేది ప్రధానం.

 

గత ఎన్నికల ముందు ఏపీలో జగన్ పాదయాత్ర చేస్తూ..అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకోవడంతో పాటు ప్రదానంగా యువతని టార్గెట్ చేసుకుని ముందుకెళ్లారు. కాలేజీల్లో మీటింగులు పెట్టారు..నిరుద్యోగ యువతని కలిశారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఓ హైదరాబాద్ అవుతుందని, అప్పుడు ఉద్యోగాలు ఆటోమేటిక్ గా వస్తాయని, యువత అందరికీ ఉద్యోగాలు దొరుకుతాయని, అలాగే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి..యువతని ఆకట్టుకుని వారి ఓట్లని బాగానే దక్కించుకున్నారు. అయితే అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా పక్కకు వెళ్లింది..జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్.

కాకపోతే జగన్ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. వీటిల్లో సచివాలయ ఉద్యోగాలు బెటర్. ఇక మిగిలిన పోస్టుల గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక ఎన్నికల దగ్గర పడుతుండటంతో మిగిలిన వాటిపై దృష్టి పెడుతున్నారు. ఇక జగన్ ప్రభుత్వంపై యువతకు అసంతృప్తి ఉంది..దాన్ని క్యాష్ చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఇటు పవన్, అటు లోకేష్ ట్రై చేస్తున్నారు.

అలాగే కొత్తగా వచ్చే ఓటర్లని కూడా ఆకట్టుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా లోకేష్ పాదయాత్ర, పవన్ బస్సు యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రల్లో యువత ఓట్లనే టార్గెట్ చేసుకుని ముందుకెళ్లనున్నారు. ఇప్పటికే జనవరి 12న యువశక్తి పేరిట పవన్ సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అటు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రకు రెడీ అయ్యారు. మరి చూడాలి ఈ సారి యువత ఎటు వైపు మొగ్గు చూపుతారో.

Read more RELATED
Recommended to you

Latest news