ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తే.. చర్యలు తప్పవు : మంత్రి నారా లోకేష్

-

ప్రభుత్వం పై దుష్ప్రచారం చేసిన వారికి చర్యలు తప్పవని ఏపీ  మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేష్  మీడియాతో మాట్లాడారు. ప్రజాకోర్టులో ఎన్డీయే ప్రభుత్వం గెలిచిందని, పరువు నష్టం కేసులో కూడా గెలుస్తామనే నమ్మకం ఉందని తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎలాంటి విషపు రాతలు రాశారో.. ఇప్పుడూ అలాగే బ్లూ మీడియా విషపు రాతలు రాస్తోందని మండిపడ్డారు. తనపై చేసిన ఒక్క ఆరోపణను కూడా వైసీపీ నిరూపించలేకపోయిందన్నారు.

“ప్రజలు మా కుటుంబాన్ని దీవించి ఆరుసార్లు అవకాశమిచ్చారు. ప్రజలు ఇచ్చిన అవకాశాలను వారికి సేవ చేసేందుకే వినియోగించాం. బ్లూ మీడియాలో ఎలాంటి మార్పు రాలేదు.. ఇంకా తప్పుడు వార్తలు వేస్తున్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం” అని లోకేశ్ స్పష్టం చేశారు. పరువుకు భంగం కలిగించేలా అసత్య కథనాలు ప్రచురించారని సాక్షి మీడియాపై నారాలోకేశ్  రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం ఆయన విశాఖ కోర్టుకు హాజరయ్యారు. లోకేశ్ వేసిన పరువు నష్టం కేసులో తదుపరి విచారణ నవంబర్ 15కు వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news