బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో .. భాష తో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకుపోతోంది. వరుసగా సక్సెస్ పొందుతూ కెరియర్ గ్రాఫ్ దూసుకెళ్తున్న సమయంలో.. 2022వ సంవత్సరం కాస్త తడబాటుకు గురైంది . అయితే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు పూజా హెగ్డే ప్రయత్నాలు చేపట్టిందనే చెప్పాలి. అందుకే ఆలయాల ప్రదర్శన చేస్తూ దేవుళ్ళ ఆశీస్సులు కూడా పొందుతుంది. ఈ క్రమంలోనే ప్రత్యేక దేవాలయంలో తన కోరికను నెరవేర్చుకోవడానికి ప్రత్యేకంగా పూజలు చేయించిందని సమాచారం.
ఇకపోతే ఐదేళ్లలో పూజా హెగ్డే వరుసహిట్లతో దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే దువ్వాడ జగన్నాధం సినిమాతో సక్సెస్ యాత్ర ప్రారంభించిన ఈమె ఆ తర్వాత మహర్షి , గద్దల కొండ గణేష్, అల వైకుంఠపురంలో, అరవింద సమేత, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయాలతో టాప్ రేంజ్ కు చేరుకుంది. అయితే టాప్ గేర్ లో తీసుకెళ్తున్నందుకు 2022 సంవత్సరం బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే రాధే శ్యామ్ సినిమాతో కొత్త సంవత్సరమే డిజాస్టర్ మూట కట్టుకుంది. ఆ తర్వాత ఆచార్య, బీస్ట్ సినిమాలు కూడా డిజాస్టర్ గా మిగిలాయి. కానీ నటిగా మెచ్యూరిటీని ప్రదర్శించిందనే మాట క్రిటిక్స్ నుంచి వినిపించింది.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఏడాది కొత్త జీవితాన్ని పొందాలి అని కాస్త టైం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోని హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడిని సందర్శించింది. ఆలయంలో పూజలు చేసి తన మొక్కులు తీర్చుకుంది. వేద పండితుల ఆశీర్వాదాన్ని పొందింది. మరి ఈసారైనా పెద్దమ్మ అనుగ్రహం పొంది ఈమె సక్సెస్ పొందుతుందేమో చూడాలి.