బాబు-పవన్ స్కెచ్..తెలంగాణలో బిగ్ ట్విస్ట్?

-

టీడీపీ అధినేత చంద్రబాబు-జనసేన అధినేత పవన్ కల్యాణ్…భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు పొత్తు దిశగా ముందుకెళుతున్నారు. అయితే వీరు కలవడంపై వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టమే అని చెప్పి కథనాలు వస్తున్నాయి. ఇక ఏపీలోనే కాదు..వీరి పొత్తు తెలంగాణలో కూడా కొనసాగుతుందని కొత్త చర్చ మొదలైంది.

అయితే వీరితో బీజేపీ కలిసొస్తుందో లేదో క్లారిటీ లేదు. తెలంగాణలో ఎలాగో టీడీపీ-జనసేనలతో పొత్తు లేదని చెప్పి అక్కడ బీజేపీ నేతలు తేల్చి చెప్పేశారు. ఇటు ఏపీలో ఏమో టీడీపీతో కలవడానికి బీజేపీ ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు బీజేపీని వదిలి జనసేన టీడీపీతో కలవాలి. ఏదేమైనా టీడీపీ-జనసేన పొత్తు మాత్రం ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ పొత్తు తెలంగాణలో కూడా ఉంటుందని ప్రచారం మొదలైంది. ఇటు ఎలాగో ఇటీవల చంద్రబాబు ఖమ్మంలో భారీ సభ పెట్టారు. దీంతో టీడీపీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు.

అలాగే తెలంగాణలో జనసేనకు కాస్త బలం ఉన్న సీట్లు ఏవో చెప్పాలని, వాటిల్లో పోటీ చేద్దామని పవన్…తెలంగాణ జనసేన నేతలకు సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబు-పవన్ కలిసి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ముందుకెళ్తారని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్తితుల్లో ఈ రెండు పార్టీలకు తెలంగాణలో పెద్దగా బలం లేదు..కానీ కొన్ని ఓట్లని చీలిస్తే..ఏ పార్టీకి నష్టం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది.

దాదాపు బీఆర్ఎస్ పార్టీకే నష్టం జరుగుతుందనే అంచనాలు వస్తున్నాయి. కానీ టీడీపీ-జనసేన పూర్తిగా  యాక్టివ్ గా అవ్వాలి..ఎన్నికల్లో పోటీ చేయాలి..మరి ఆ పరిస్తితి ఉంటుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news