ఎల్ఐసీ ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. చాలా మంది ఎల్ఐసీ అందించే స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. పైగా ఎల్ఐసీ నుంచి అతి తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ని కూడా ఇస్తున్నారు. అయితే బీమా ప్లాన్ తీసుకున్న వారికి పాలసీ పత్రం ఇస్తారు.
ఈ పత్రాన్ని భద్రంగా ఉంచుకోవాలి. క్లెయిమ్ చేయాలన్నా లేదా పాలసీని సరెండర్ చేయాలన్నా ఇది ఉండాలి. ఒకవేళ కనుక ఇది మిస్ అయితే అప్పుడు మనం ఏం చెయ్యాలి..? ఎలా తిరిగి పొందొచ్చు అనేది చూద్దాం.
ఎలా డూప్లికేట్ ని తీసుకోవచ్చు..?
ఒకవేళ కనుక మీ పాలసీ పత్రం కనిపించకుండా పోతే అప్పుడు డూప్లికేట్ పాలసీ పత్రాన్ని ఎల్ఐసీ నుంచి తీసుకోవచ్చు. మీ పత్రం కనపడకపోతే ఎల్ఐసీకి తెలియజేయాలి. లేదంటే ఏజెంట్ కి చెప్పండి.
ఏదైనా వార్తాపత్రికలో ఓ ప్రకటన ఇవ్వాలి. అప్పుడు దొరికిన వాళ్ళు ఇస్తారు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలి. వాళ్ళు రసీదు ఇస్తారు. దాన్ని ఉంచండి.
తర్వాత బాండ్ దాఖలు చేయాలి. నాన్-జుడీషియల్ స్టాంప్ పేపర్‌పై బీమాదారు, పాలసీదారు సంతకం చేయాలి.
ఫైనల్ గా మీరు ఎల్ఐసీ శాఖకు వెళ్లి డూప్లికేట్ పాలసీ కోసం దరఖాస్తు చేయండి. ఇలా మీకు ఓ డూప్లికేట్ పాలసీ పత్రాన్ని బీమా కంపెనీ జారీ చేస్తుంది. దాని మీద డూప్లికేట్ అని ఉంటుంది.