ఢిల్లీ నుండి సింగపూర్‌, మలేషియా టూర్ ప్యాకేజీ… వివరాలు ఇవే..!

-

ఇండియన్ రైల్వేస్‌ వివిధ రకాల ప్యాకేజీలని తీసుకు వచ్చింది. ఈ ప్యాకేజీల ద్వారా చాలా మంది ప్రయాణికులు నచ్చిన టూర్లు వేస్తున్నారు. తాజాగా ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం ఓ కొత్త ప్యాకేజీ ని తీసుకు వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీ. దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ టూర్ లో భాగంగా మీరు సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలను చూసి వచ్చేయచ్చు. మరి ఇక ఐఆర్‌సీటీసీ తాజాగా ప్రకటించిన సింగపూర్ టూర్ ప్యాకేజీ వివరాలను చూద్దాం. ఈ టూర్ కి 32 మందికి మాత్రమే అవకాశం వుంది. రెండు సార్లు ఉంటుంది.

ఫస్ట్ ది జనవరి 18న ప్రారంభం అవుతుంది. రెండోది జనవరి 24న ఉంటుంది. ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది. సింగపూర్‌లోని పుత్రజయ టూర్, కింగ్స్ ప్యాలెస్, జామెక్స్ మసీదు, చాక్లెట్ ఫ్యాక్టరీ, పెట్రోనాస్ ట్విన్ టవర్ వంటివి చూసి వచ్చేయచ్చు.

ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్ పక్కా ఉండాలి. వీసా ఫామ్ 14Aను ఫిలప్ చేసి, సంతకం చెయ్యాలి. అలానే కొన్ని వివరాలు కూడా ఇవ్వాల్సి వుంది. ఇక ఈ ప్యాకేజీ ధరల విషయానికి వస్తే… సింగిల్ ఆక్యుపెన్సీ కి రూ.1,35,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే డబుల్/ట్రిపుల్ ఆక్యుపెన్సీ కి రూ.1,15,500 చెల్లించాలి. పిల్లలు ఉంటే ఎక్స్ట్రా పే చెయ్యాలి. https://www.irctctourism.com/ లో పూర్తి వివరాలని చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news