ఏపీ సీఎం జగన్ కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు సీఎం జగన్ కి రాసిన లేఖలోని ముద్రగడ ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్లు పోరాటానికి ముగింపు పలికే దిశగా మీ అడుగులు ఉండాలని సీఎం జగన్ ను ముద్రగడ పద్మనాభం కోరారు.
స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల వారు వారిని ఉపయోగించుకున్నారు..అందరిలా మీరు చేయవద్దని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో వీరి కోరిక సమంజసం న్యాయం అని మీరు అన్నారని విన్నాను..కాపు నాయకులు కన్నా మీరు చాలా మంచిగా మద్దతు ఇస్తూ మాట్లాడారని చెప్పుకున్నారన్నారు. రిజర్వేషన్ విషయంలో న్యాయం చేయమని కోరుతున్నానని వెల్లడించారు ముద్రగడ పద్మనాభం.