ఖమ్మం సభకు ప్రతి ఇంటి నుంచి తరలిరావాలి : కేసీఆర్​

-

ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ సభకు ప్రతి ఇంటి నుంచి ప్రజలు తరలిరావాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆవిర్భావ సభ హోరెత్తాలని, పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు, రైతులు పెద్దఎత్తున హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్‌ సూచించారు. పార్టీ నేతలంతా సమన్వయంతో వ్యవహరించి, సభ విజయవంతానికి కృషి చేయాలన్నారు. ఖమ్మం సభ ఏర్పాట్లపై శనివారం ఆయన తన నివాసంలో ముఖ్యనేతలతో సమావేశమయ్యారు.

‘‘బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి తగ్గట్లు సన్నాహాలు జరగాలి. కేరళ, దిల్లీ, పంజాబ్‌ల సీఎంలు విజయన్‌, కేజ్రీవాల్‌, భగవంత్‌మాన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లు హాజరవుతున్నారు. వారికి ఘనంగా స్వాగతం పలకాలి. ఖమ్మం జిల్లా ప్రజలకు సభ ప్రాధాన్యం తెలపాలి. ప్రతి ఇంటి నుంచి పాల్గొనేలా చూడాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్‌, డోర్నకల్‌, పాలకుర్తి, తుంగతుర్తి, కోదాడ, హుజూర్‌నగర్‌ల నుంచీ జనసమీకరణ జరగాలి. ఏపీ నుంచి కూడా ప్రజలు ఉత్సాహంతో వస్తున్నారని అక్కడి బీఆర్ఎస్ నేతలు తెలిపారు. వారికి సౌకర్యాలు కల్పించాలి. ’’ అని సీఎం సూచించారు

Read more RELATED
Recommended to you

Latest news