చిరంజీవి-బాలకృష్ణ సినిమాలు సేమ్ టూ సేమ్ బట్ డిఫరెంట్

-

సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు.. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో సందడి చేశారు. పోటాపోటీగా సంక్రాంతి బరిలో దిగిన ఈ ఇద్దరి సినిమాలను ప్రేక్షకులు సమానంగా ఆదరిస్తున్నారు. ఇక సినిమా చూసిన వాళ్లంతా రెండు సినిమాలో ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి.. తేడాలేంటి అని వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల్లో ఒకే తీరుగా ఉన్న సీన్స్.. తేడాలు ఓసారి చూద్దామా..?

 

  • ఈ రెండు చిత్రాల టైటిళ్లు వెలువడటమే ఆలస్యం పోలిక మొదలైంది. అదే రెండింటిలో ఉన్న ‘వీర’. ఇటు ‘వీర’సింహారెడ్డి.. అటు వాల్తేరు ‘వీర’య్య.
  • రెండు సినిమాల్లోనూ కథానాయిక శ్రుతిహాసనే
  • హీరో పాత్రను ఎలివేట్‌ చేసే పాటలు, ఐటెమ్‌ సాంగ్స్‌.
  • రెండింటిలోనూ తొలి పోరాట దృశ్యాలు పడవ(చిరు)/ఓడ(బాలయ్య)పై చిత్రీకరించినవే.
  • ప్రథమార్ధంలోని పలు సీన్స్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. (వీరసింహారెడ్డి.. ఇస్తాంబుల్‌/ వీరయ్య.. మలేషియా)
  • కథానాయకుల తోబుట్టువు (సవతి చెల్లి/ సవతి తమ్ముడు) పాత్రలు కీలకం. సెంటిమెంట్‌కు ప్రాధాన్యం. (వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. రవితేజ)
  • ఆయా పాత్రలు రెండు సినిమాల్లో ఒకేలా ముగుస్తాయి.
  • రెండింటి క్లైమాక్స్‌లోనూ ప్రతినాయకుల పాత్ర తల తెగిపడుతుంది.
  • రెండు సినిమాల దర్శకులు ఆయా హీరోల అభిమానులు. (గోపీచంద్‌ మలినేని- బాలకృష్ణ, కె. బాబీ- చిరంజీవి).
  • రెండింటి ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఒక్కరే. యాక్షన్‌ కొరియోగ్రఫీ, డ్యాన్స్‌ కొరియోగ్రఫీ విషయానికొస్తే అక్కడ పని చేసినవారే ఇక్కడా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news