ఇండోనేషియాలో భారీ భూకంపం

-

ఇండోనేషియాలోని సుమత్ర దీవి తీరాన తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైంది. సింగ్కిల్ ప్రాంతానికి 48 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే ప్రాణనష్టంపై సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవల తరచూ ఇండోనేషియాలో భూకంపాలు నమోదు కావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే.. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిన్న స్వల్ప భూకంపం సంభవించింది.

శనివారం ఉదయం 5.17 గంటలకు ధర్మశాలలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. ధర్మశాలకు 76 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news