జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. నిజాం రాజు కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎనిమిదో నిజాం రాజు అకాల మృతి చెందాడు. ఇస్తాంబుల్ లో ముఖరంజా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఇక ఇవాళ ముఖరంజా అంత్య క్రియలు హైదరాబాద్ లో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే, ఆయనకు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసారు కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ. అంతేకాదు, జనవరి 17న అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేత షబ్బీర్ ఆలీ.
Deeply saddened to learn about the demise of 8th Nizam Mir Mukkaram Jah Bahadur. Demand @TelanganaCMO to declare an official holiday and conduct his last rites with State honour on 17th January. Family sources have confirmed that Namaz e Janaza will be offered at Mecca Masjid. pic.twitter.com/RsxCAB8ybr
— Mohammad Ali Shabbir (@mohdalishabbir) January 15, 2023