ఇంటికి వచ్చిన అథితిపై ఉమ్మేయడమే అక్కడ ఆచారం..!!

-

ఈ భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి వారికి సంబంధించిన కొన్ని సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు ఉన్నాయి..  ఒక్కో తెగలో ఒకలా.. మన దగ్గర అయితే ఒక్కో కులంలో ఒక్కోలా..! అయితే చాలావరకూ మనకు తెలిసినవే ఉంటాయి.. కొన్ని కొత్తగా ఉంటాయేమో కానీ వింతగా అయితే అనిపించవు..కానీ కొందరు పాటించే ఆచారాలు మాత్రం మీకు కచ్చితంగా ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి.. అతిథులు, నవజాత శిశువులపై ఉమ్మివేయడం అక్కడి సంప్రదాయం. ఏంటీ నమ్మడం లేదా..? అయితే ఈ ఆర్టికల్‌ మొత్తం చదివేయండి..!!
ఆఫ్రికాలోని ఒక తెగలో మసాయి ప్రజలు ఇంటికి వచ్చిన అతిథుల నుంచి అప్పుడే పుట్టిన పిల్లల వరకు ప్రతి దానిపై ఉమ్మివేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది వింత ఆచారం. మసాయి తెగ ప్రజలు కెన్యా, టాంజానియా ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ తెగ ప్రజలు తమ అతిథులను స్వాగతించడానికి పూలు ఇవ్వరు..తమ ఇంటికి అతిథి రాగానే చేతులపై ఉమ్మివేసుకుని పలకరించుకుంటారు. ముందుగా ఒకరి చేతుల మీద ఒకరు ఉమ్మి, ఆ తర్వాత కరచాలనం చేసుకుంటారు. వింటుంటేనే ఏదోలా ఉంది కదూ..! కానీ మాసాయి కమ్యూనిటీలోని ప్రజలు దీనిని గౌరవానికి చిహ్నంగా భావిస్తారు. అంతే కాదు, పుట్టిన బిడ్డను చూసేందుకు జనం వెళితే, ఆశీర్వదించేందుకు తలపై ఉమ్మివేసి మాత్రమే ఆశీర్వదిస్తారట..
మసాయి తెగ ప్రజలు టాంజానియా, కెన్యాలో మాత్రమే నివసిస్తున్నారు. వీరి సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరువలో ఉంది. మాసాయి తెగ ప్రజలు ఎరుపు రంగు దుస్తులను ఎక్కుగా వేసుకుంటారు.. ఈ ప్రజల అనేక సంప్రదాయాలు విచిత్రమైనవి. మసాయి ప్రజలు జంతువుల మాంసాన్ని తిని వాటి రక్తాన్ని తాగుతూ జీవిస్తారు. అలా చేస్తే.. ఎలాంటి వ్యాధులు రావని వారి నమ్మకం..
నిజానికి ఆఫ్రికాలోని వివిధ తెగల ప్రజలు వివిధ ఆచారాలను నేటికి పాటిస్తున్నారు.. అక్కడ ఒక్కో తెగది ఒక్కో ఆచారం.. కొన్ని తెగల్లో ఫస్ట్‌నైట్‌ రూంలోకి వధువుతోపాటు వధువు తల్లి కూడా వెళ్లి మొత్తం వివరంగా చెప్తుందట.. ఇంకా ఇలాంటి ఎన్నో ఆచారాలను వారు పాటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news