జగన్‌తో స్నేహం కేసీఆర్‌కు మంచిది కాదు : ఎంపీ రఘురామ

-

దుష్టుడైన జగన్‌మోహన్‌రెడ్డితో మంచివాడైన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు స్నేహం అంత మంచిది కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పవన్‌ కల్యాణ్‌కు దన్నుగా నిలుస్తున్నారని భావిస్తున్న రాష్ట్రంలోని ఒక ప్రముఖ సామాజికవర్గాన్ని విభజించాలని తమ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దానికి ప్రాంతీయతత్వాన్ని వదిలి జాతీయ దృక్పథంతో పార్టీని ప్రారంభించిన కేసీఆర్‌ వంటి మహా నాయకుడు తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించడం ఏమాత్రం సబబు కాదని అన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు విశ్రాంత అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించినందుకు, తమ సామాజికవర్గాన్ని కేసీఆర్‌ ప్రోత్సహిస్తున్నారంటూ ఆయనను కలిసి అభినందనలు తెలియజేయడం ఆశ్చర్యంగా ఉంది.”’ అని రఘురామ పేర్కొన్నారు. గతంలో పవన్‌పై ఏడ్చే తమ పార్టీ నాయకులు యువశక్తి సభ అనంతరం పెడ బొబ్బలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news