మైక్రోసాఫ్ట్‌ ఉద్యోగులకు షాక్.. 11వేల మంది తొలగింపు

-

మెక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఆ కంపెనీ షాక్ ఇచ్చింది. 11వేల మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇవాళ్టి నుంచే ఆ తొలగింపు ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు తెలుస్తోంది. మానవ వనరులు, ఇంజినీరింగ్‌ విభాగాల్లో అధికంగా తొలగింపులు ఉంటాయని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతలు, మాంద్యం భయాలు బలపడుతున్న నేపథ్యంలో కంపెనీలన్నీ వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న విషయం తెలిసిందే.

వచ్చే రెండేళ్ల పాటు కంప్యూటర్‌ పరిశ్రమ తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు ఇటీవలే మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న పరిణామాలకు మైక్రోసాఫ్ట్‌ సైతం అతీతమేమీ కాదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డిజిటల్‌ సంస్థల్లో సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా తొలగింపులపై సంకేతాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news